గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్ల‌ను రోజూ తీసుకోండి..!!

గుండె ఆరోగ్యం ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్ర‌స్తుతం చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా అస్త‌వ్య‌స్త‌మైన ఆహారపు అల‌వాట్ల‌తోపాటు ఒత్తిడిని ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చని వైద్యులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం కోసం స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీల జాతికి చెందిన పండ్ల‌ను రోజూ తీసుకుంటే మేలు జరుగుతుంది. ఈ పండ్ల‌లో ఆంథో స‌య‌నిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. ర‌క్త నాళాల ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. ర‌క్త నాళాల వాపులు త‌గ్గేలా చేస్తాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. బెర్రీ పండ్ల‌లో విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, మాంగ‌నీస్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి. గ్రేప్ ఫ్రూట్‌, నిమ్మ వంటి పండ్ల‌ను తింటుంటే విట‌మిన్ సి, ఫ్లేవ‌నాయిడ్స్ అధిక మొత్తంలో ల‌భిస్తాయి. ఇవి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. ఈ పండ్ల‌లో అధికంగా ఉండే పొటాషియం బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

what-foods-prevent-heart-attacks-what-to-eat-and-what-to-avoid

అదే విధంగగుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో యాపిల్ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక యాపిల్‌ను తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. అవ‌కాడోలు కూడా గుండెకు మేలు చేస్తాయి. ఈ పండ్లలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. బీపీ త‌గ్గేలా చేస్తాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అర‌టి పండ్లలో ఉండే పొటాషియం బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. గుండె ప‌నితీరు మెరుగు ప‌డేలా చేస్తుంది. గుండె జ‌బ్బులు రావొద్దంటే రోజూ ఒక అర‌టి పండును తింటున్నా ఎంతో మేలు జ‌రుగుతుంది. ద్రాక్ష పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. ఇలా ఈ పండ్ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+