2025లో ధనవంతులయ్యే రాశులు ఇవే
కొత్త సంవత్సరం రావడానికి మరో మూడువారాల సమయం మాత్రమే ఉంది. ఆంగ్ల నామ సంవత్సరమైనప్పటికీ ప్రజలు మాత్రం కొత్త సంవత్సరం నుంచి తమకు బాగా కలిసివస్తుందనే నమ్మకంలో ఉంటారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరంప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఆంగ్ల నామ సంవత్సరం జనవరి నుంచి ప్రారంభం కానుండటంతో ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. వచ్చే ఏడాది గురువు, రాహువు, కేతువు రాశులను మారుస్తున్నాయి. అలాగే శనిదేవుడు మీనరాశిలోకి 30 సంవత్సరాల తర్వాత ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారు ధనవంతులవుతున్నారు. కెరీర్ పరంగా కూడా వారికి బాగా కలిసి రానుంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభం
వృత్తిలో విజయం సాధిస్తారు. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు. అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోవాల్సిన బాధ్యత మాత్రం మీపై ఉంటుంది. కొత్త సంవత్సరంలో సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి.

కర్కాటకం
వీరు కొంతకాలం నుంచి కంటున్న కలలన్నీ నెరవేరతాయి. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి పూర్తవుతుంది. అనారోగ్యం ఉన్నప్పటికీ తగ్గిపోతుంది. వ్యాధుల నుంచి బయటపడతారు. సంపాదనకు మార్గాలు దొరుకుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
సింహం
కొత్త సంవత్సరంలో ఈ రాశివారు ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 2025లో ఏ రంగంలో వీరు అడుగుపెట్టినా విజయాన్ని అందుకుంటారు. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. డబ్బును పొదుపు చేయడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది.
కుంభం
క్రమశిక్షణతో పనిచేయడం అవసరం. దీనివల్ల డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఎంత కష్టపడితే అంత సొమ్మును సంపాదించుకోగలుగుతారు.
మీనం
కొత్త సంవత్సరం వీరికి బాగా కలిసివస్తుంది. వీరికి ఎంతో శక్తివంతమైన సంవత్సరం అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications