వాస్తు ప్రకారం ఈ దిశలో నిద్ర సంపదను తెస్తుంది..!
వాస్తు అనేది మన భారతీయుల పురాతన శాస్త్రం. అన్ని విషయాల్లోను దీన్ని అనుసరిస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. మనం నిద్రించే దిశ కూడా వాస్తుపై ఆధారపడివుంటుంది. నిద్రించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. వాస్తు ప్రకారం ఏ దిక్కున నిద్రించాలి? వాస్తు ఏం చెబుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం.
తూర్పు దిక్కు
ఈ దిక్కున పడుకుంటే తాత్విక ఆలోచనలు పెరుగుతాయి. నమ్మకాలు పెరగడంతోపాటు అభ్యాసాలను మెరుగుపరుస్తుందని నమ్మకం. ఈ దిక్కుకు ఎదురుగా వరుణుడు ఉంటాడు. తూర్పు దిక్కు నిద్ర పోవడానికి చాలా శుభప్రదమైన దిక్కు.

ఉత్తర దిక్కు
మన పెద్దలు ఈ దిక్కున తల పెట్టి నిద్ర పోవద్దని చెబుతారు. ఈ దిశలో పడుకుంటే నిద్ర కలత నిద్ర పడుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మృత్యుదేవత ఈ దిశతో సంబంధం కలిగివుంటుంది. దక్షిణ పాలకుడు యముడు ఉంటాడు. మంచం నైరుతి మూలలో ఉండాలి.
పశ్చిమ దిక్కు
ఈ దిక్కున నిద్రిస్తే ఉదయించే సూర్యుడివైపు నమస్కారాల చేయడానికి వీలుంటుంది. తూర్పున సూర్యోదయంతో సమానం ఈ వైపు నిద్రించడం అంటే. తూర్పు దిక్కును పాలించే ఇంద్రుడితో ఈ దిక్కు ముడిపడివుంటుంది. అంతేకాదు ఈ వైపు నుంచి దేవతా శక్తులు ప్రసరిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ దిక్కు
ఈ వైపు నిద్రిస్తే ఎంతో మచిదని నమ్ముతారు. ఈ దిక్కుకు ఎదురుగా ఉత్తర దిక్కును పాలించే కుబేరుడు ఉంటాడు. దక్షిణ దిక్కులో నిద్రిస్తే మీ శరీరాన్ని భూ అయస్కాంత క్షేత్రంతో సమానంగా చేస్తుంది. సంపదనివ్వడంతోపాటు శ్రేయస్సును, ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. నిద్ర పోవడానికి ఇది అత్యంత ఉత్తమమైన దిక్కు.












Click it and Unblock the Notifications