12 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అద్భుత యోగం

ఒకే రాశిలో రెండు గ్రహాలు కలిస్తే దాన్ని యుతి లేదంటే సంయోగం అంటారు. మే ఒకటో తేదీన వృషభరాశిలో గురుడు సంచరించబోతున్నాడు. అదే సమయానికి సంపదనిచ్చే శుక్రుడు కూడా వృషభరాశిలోకి వెళుతున్నాడు. ఇలా ఒకే రాశిలో శుక్రుడు, గురుడు కలవడంవల్ల అరుదైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇది వస్తోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టబోతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేషరాశి:గజలక్ష్మీ రాజయోగం వీరికి బాగా కలిసిరానుంది. కోరికలన్నీ నెరవేరతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ సరిగా ఉంటాయి. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు అవడంతోపాటు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

after 12 years Guru shukra yuti 2024

కర్కాటక రాశి:గురుడు, శుక్రుడి కలయిన కర్కాటక రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందడంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. వీరు ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు. అలాగే పెట్టిన పెట్టుబడులన్నీ ఊహించనిరీతిలో లాభాలను ఇస్తాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగుంటారు. ఉద్యోగ రీత్యా లేదంటే వ్యాపార రీత్యా ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది.

సింహరాశి :గజలక్ష్మి రాజయోగం ఈ రాశివారికి మేలు చేస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బును పొదుపు చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో మీపై గౌరవం కలుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు విపరీతమైన లాభాలను ఇస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+