30 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటోంది
నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలు, మరికొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తుంటాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు, రాహువు కలవబోతున్నారు. ఈ సంయోగంవల్ల ఆర్థికంగా కొన్ని రాశులవారు మంచి స్థాయికి చేరుకోబోతున్నారు. శనిదేవుడు మీనరాశిలోకి రానుండటం, రాహువు అక్కడే ఉండటంవల్ల ఈ సంయోగం జరుగుతోంది. ఈ సమయంలో మూడు రాశులవారు ఎటువంటి పనులు తలపెట్టినా అద్భుతమైన ఫలితాలను పొందుతారని, ఆకస్మిక ధనలాభాలుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. రాహువు-శని సంయోగంవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
వీరికి సంతోషం రెట్టింపు అవుతుంది. శనిదేవుడి అనుగ్రహం లభించడంవల్ల మంచి ధనలాభాన్ని పొందుతారు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. కొత్తగా వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. సంపాదించే డబ్బును పొదుపు చేయడంద్వారా మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారు.

మిథునరాశి
ఉద్యోగస్థులకు వారి వారి కార్యాలయాల్లో పెద్ద పెద్ద పదవులు లభిస్తాయి. కొత్తగా బాధ్యతలు చేపడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాలపై పెట్టుబడి పెడతారు. ఒకరకంగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు స్థాయిలో పొందుతారు.
కుంభరాశి
శనిదేవుడి సొంత రాశి ఇది. వీరిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. ఎదుటివారితో మంచి సంబంధాలను పెంచుకుంటారు. ఆర్థికంగా ఒక స్థాయికి వస్తారు. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నేతలకు పదవులు లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. డబ్బును పొదుపు చేస్తారు. ప్రేమలో ఉన్నవారికి అన్నీ అనుకూలంగా జరుగుతాయి.












Click it and Unblock the Notifications