గుడికి వెళ్లొచ్చేటప్పుడు చేయకూడని 3 తప్పులు- దోషాలు అధికం
గుడికి వెళ్లొచ్చినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగిపోతాం. ఓ పాజిటివ్ ఎనర్జీ ఆవరిస్తుంది. గుడిలో అర్చకులు చదివే వేదమంత్రోచ్ఛారణలు, ఘంటానాదం.. ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం, హారతిని కళ్లకు అద్దుకోవడం వంటివి భక్తిశ్రద్ధలతో చేస్తుంటాం.
దేవాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు చేయకూడని 3 పొరపాట్లు
తిరిగి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వీటి వల్ల దోషం వాటిల్లే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకుని వాటిని నివారించాలి.

1. తిరిగి వస్తుంటే గంట కొట్టకూడదు
సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లే ముందు గంట కొడతాం. కాని తిరిగి వస్తున్నప్పుడు కూడా చాలామంది గుడి గంటను కొడుతుంటారు. అలా చేయడం సరైనది కాదు. గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొడితే మన జీవితంలోకి సానుకూల శక్తి వస్తుందని, ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్ముతారు. తిరిగి వస్తున్నప్పుడు గంట కొడితే, ఆ సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది. కాబట్టి, ఈ పొరపాటు చేయకూడదు.
2. గుడి నుండి ఖాళీ చేతులతో రాకూడదు
గుడికి వెళ్లేటప్పుడు పూలు, పండ్లు, అగరబత్తులు, నైవేద్యాలను వెంట తీసుకువెళ్తాం. వాటిని దేవుడికి సమర్పిస్తాం. అయితే గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. కనీసం కొన్ని పువ్వులు లేదా ప్రసాదం తీసుకుని రావాలి. శివుడికి నీళ్లు సమర్పిస్తే అందులోంచి కొద్దిగా ఇంటికి తీసుకురండి. గుడి నుండి ఖాళీ చేతులతో రావడం శుభప్రదంగా భావించరు.
3. వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు
చాలామంది గుడి నుండి రాగానే కాళ్లు, చేతులు కడుక్కుంటారు. మీరు కూడా ఇలా చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా చేయడం మంచిది కాదు. కాళ్లు గనుక మురికిగా ఉంటే వాటిని గుడ్డతో తుడుచుకోవచ్చు. అంతేగానీ నీటితో కడగకూడదు. కాసేపు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. గుడి నుండి వచ్చిన వెంటనే కాళ్లు చేతులు కడుక్కోకపోతే గుడిలోని సానుకూల శక్తి కొంతసేపు మీలో ఉంటుంది. దీనివల్ల మీరు సానుకూలంగా ఉంటారు. ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. వీటిని నివారించుకోవడం వల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించి, తిరిగి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications