బుధుడి దయతో నేటినుండి వీళ్ళు నక్కతోక తొక్కి కోటీశ్వరులు అవుతున్నారు
మా జాతకంలో అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకి వివిధ గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం బుధుడు కొన్ని రాశుల వారికి సంపదల భాగ్యాన్ని మోసుకుని వచ్చాడు. గ్రహాల రాకుమారుడిగా చెప్పబడే బుధుడు వాక్కు, బుద్ధి, వ్యాపారం మొదలైన వాటికి అధిపతి. అటువంటి బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
అశ్విని నక్ష్త్రంలోకి బుధుడు
ఇక నేడు బుధుడు అశ్విని నక్షత్రం లోకి సంచారం ప్రారంభించాడు. అశ్విని నక్షత్రంలో బుధ సంచారం వారం రోజులపాటు సాగుతుంది. ఆపై మే 14న బుధుడు అశ్విని నక్షత్రం నుండి భరణి నక్షత్రంలోకి సంచారం మొదలు పెడతాడు. ఈ కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
అశ్విని నక్షత్రంలో బుధ సంచారం కారణంగా మేష రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను ఆర్జించి సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగం చేసే వారికి కూడా పురోగతి కనిపిస్తుంది. వీరి ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మేష రాశి జాతకులకు నేటి నుండి అదృష్టం ప్రారంభమైనట్టే.
సింహరాశి
అశ్వినీ నక్షత్రంలో బుధ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అన్ని విధాలా కలిసొస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. సింహరాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు చూస్తారు. సింహ రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది వీరికి అదృష్ట సమయం.
తులా రాశి
బుధుడి నక్షత్ర మార్పు తుల రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే తులా రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులు గా మారతారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తుల రాశి జాతకులకు తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. పనిచేసే చోట వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి. నేటి నుండి వీరికి సంపదల వర్షం కురుస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications