వాస్తు ప్రకారం అదృష్టాన్ని తీసుకొచ్చే ఈ లక్కీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోండి
వాస్తు శాస్త్రంలో మొక్కలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కొన్ని రకాల మొక్కలు ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడతాయని విశ్వసిస్తారు. అటువంటి మొక్కలలో 'క్రాసులా' ఒకటి. దీనిని 'జేడ్ ప్లాంట్' లేదా 'మనీ ట్రీ' అని కూడా పిలుస్తారు. వాస్తు ప్రకారం ఈ మొక్క ధన సంపదను ఆకర్షించే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు.
ఏ దిశలో ఉంచాలి..
దీనిని సరైన దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంట్లో ఈ మొక్కలను పెంచుకోవాలనుకున్నప్పుడు ఏ దిశలో ఉంచితే మెరుగైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన ద్వారం..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా, బయటి నుండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మెయిన్ డోర్‌కు కుడివైపున క్రాసులా మొక్కను ఉంచడం వల్ల, అది ప్రతికూల శక్తులు ఇంటిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇది సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని ఆహ్వానిస్తుందని వాస్తు నిపుణులు పేర్కొంటారు.
ఉత్తర లేదా తూర్పు దిశ..
ఉత్తర దిశను కుబేరుడి స్థానంగా పిలుస్తారు. ఈ దిశలో క్రాసులా మొక్కను ఉంచడం ద్వారా కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే, సూర్యుడికి నిలయమైన తూర్పు దిశలో ఈ మొక్కను పెంచడం ద్వారా ఇంట్లో ఆరోగ్యం, గౌరవం, ప్రశాంతత వెల్లివిరుస్తాయని నమ్ముతారు.
ధన స్థానంగా ఆగ్నేయం
వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశను (దక్షిణం-తూర్పు మూల) 'వెల్త్ కార్నర్' లేదా ధన స్థానంగా పరిగణిస్తారు. శుక్ర గ్రహాధిపత్యం వహించే ఈ దిశలో క్రాసులా మొక్కను ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా లివింగ్ ఏరియాలో ఈ మొక్కను ఉంచడం వల్ల చిక్కుకుపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తారు.
ఎక్కడ ఉంచకూడదు?
క్రాసులా మొక్కను పడక గదిలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే దీని శక్తి నిద్రకు భంగం కలిగించవచ్చు. మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. అలాగే, బాత్‌రూమ్ లేదా మరుగుదొడ్ల సమీపంలో ఉంచడం వల్ల సానుకూల శక్తి క్షీణించే అవకాశం ఉంది. వంటగది లేదా పూర్తిగా వెలుతురు లేని చీకటి మూలల్లో ఉంచినప్పుడు ఈ మొక్క వాడిపోయే ప్రమాదం ఉంది. మొక్క ఎండిపోవడం వాస్తురీత్యా అశుభం.
సంరక్షణ చిట్కాలు
ఈ మొక్కకు ఎక్కువగా నీరు అవసరం లేదు. కుండీలోని మట్టి పూర్తిగా ఎండిపోయినట్లు అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయాలి. అలాగే, మొక్కను నేరుగా కఠినమైన ఎండ తగలకుండా, తగినంత సహజ వెలుతురు వచ్చేలా చూసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications