వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి రోజను ఎలాంటి వాస్తు సూచనలు పాటిస్తే ఎలాంటి మేలులు జరుగుతాయి..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

భారతీయుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దేశమంతా సమైక్యంగా జరుపుకునే ఫెస్టివల్స్ లో ఇది ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను 5 రోజులు జరుపుకుంటారు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి.

దీపావళి ఎప్పుడు:- దీపావళి నాడు అబాల గోపాలం కొత్త బట్టలు ధరించి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజున ఘుమఘుమలాడే పిండి వంటలు చేస్తారు. ప్రతి ఏటా దీపావళిని ఆశ్వీయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది అమావాస్య రోజు సూర్య గ్రహణం ఉన్న కారణంగా దీపావళి అక్టోబరు 24 సోమవారం రోజు జరుపుకోవాలి, సోమవారం రోజు సాయంత్రం 5 : 28 నిమిషాల నుండి అమావాస్య తిధి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజే దీపావళి లక్ష్మీ పూజలు నిర్వహించుకోవాలి. ఈ పండుగకు మందు రోజు వచ్చే ఆశ్వీయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశి చేసుకుంటారు. ఈ దీపావళి పండుగకే దీపాల పండుగ, దివ్వెల పండుగ అనే పేర్లు ఉన్నాయి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం అనవాయితీ.

Diwali Vastu tips:clean offices and homes on this auspicious day,here is why

దీపావళి రోజున ఈ వాస్తు చిట్కాలు పాటించండి:-

1) దీపావళి పండగకు మీ ఇల్లు లేదా ఆఫీసును శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలశక్తి ప్రవహిస్తుంది. అంతేకాకుండా వంటగది, స్టోర్ రూంను క్లీన్ చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది.

2) దీపావళి పండుగకు క్లీలింగ్ చేసే క్రమంలో ఇంట్లో విరిగిన, పగిలిన వస్తువులను తొలగించండి. పగలిన అద్దాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, బొమ్మలు, వాడలేని వస్తువులు అన్నింటినీ తీసేయండి. ఇలా చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది.

3) ఇంటి ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. కాబట్టి ఉత్తర, ఈశాన్య దిశలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. నార్త్ లో వాస్తు దోషం ఉంటే మీరు ఆదాయాన్ని కోల్పోతారు. లివింగ్ రూమ్‌లో ఉత్తరం వైపున ఉన్న అక్వేరియం మరియు టెర్రస్‌పై పక్షులకు నీరు, ధాన్యం నింపిన గిన్నె ఉండటం వలన మంచి జరుగుతుంది.

4) దీపావళి రోజున మీ ఇంటిని లైట్లు, పువ్వులు, రంగోలి, నువ్వుల నూనెతో దీపాలు, గులాబీ రేకులు మరియు ఇతర అలంకార వస్తువులతో డెకరేషన్ చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి తన అనుగ్రహన్ని కురిపిస్తుంది.

5) దీపావళి లక్ష్మీ అమ్మవారి పూజలో తప్పకుండా ' గోమాత సామెత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు మరియు భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్నటువంటి పటాన్ని పూజలో పెట్టి పూజించండి, ఇలా పూజించడం వలన వాస్తు లోపాలు, నరదృష్టి, శత్రు దృష్టి గ్రహ పీడలు నివారణ జరిగి అసకల సౌభాగ్యాలు కలుగుతాయి.

English summary
Cleaning office and house on diwali day will bring good luck according to astrology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X