వాస్తు ప్రకారం ఏ చీకూ చింతా లేని జీవనం గడపడం కోసం.. !!

ఆర్థిక ఇబ్బందులు లేని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం, మన జీవితంలో కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించాలన్నా, దరిద్ర బాధలు వీడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత కీలకం. మనకు తెలియకుండానే ఇంట్లో చేసే కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై తరచూ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని సంప్రదాయ పరిహారాలు సహాయపడతాయి.

లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండే నివాసంలోనే కొలువై ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఇంటిని, పూజా గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. సూర్యాస్తమయ సమయంలో లేదా ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఊడ్చడం గానీ, తుడవడం గానీ చేయకూడదు. దీనివల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని విశ్వసిస్తారు.

Do These 5 Vastu Things Daily at Home to Remove Money Stress and Build Wealth these steps help

మన సంప్రదాయంలో చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అందుకే పొరపాటున కూడా చీపురుపై కాలు పెట్టకూడదు. అలాగే చీపురును ఇంట్లో ఎవరికీ కనిపించని విధంగా ఉంచాలి. నిలబెట్టి ఉంచకూడదు. దానికంటూ ఓ ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలి. చెప్పులు ఉన్న చోట చీపురును ఉంచకూడదు. వాటికి దూరంగా పెట్టాలి.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యానికి కొరత ఉండదని నమ్ముతారు. దీనితో పాటు భగవద్గీత పఠించడం వల్ల సకల సమస్యలకూ సులభంగా పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని నిత్యం పఠించడం వల్ల ఎలాంటి ఆర్థిక సంక్షోభాల నుంచీ శీఘ్రంగా ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.

లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ఎదుట నిత్యం నెయ్యి దీపం వెలిగించి, కనకధారా స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ స్తోత్ర పారాయణం మన దారిద్ర్యాన్ని దూరం చేసి, అనుకూల మార్గాల్లో ధన ప్రాప్తిని కలిగిస్తుంది. సంపూర్ణ భక్తిశ్రద్ధలతో చేసే ఈ ఆరాధన కుటుంబంలో సుఖశాంతులను నింపి భవిష్యత్తును సురక్షితంగా మారుస్తుంది.

చేసే పనిలో లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకునే వారు హనుమంతుడిని ఆరాధించాలి. సాయంత్రం వేళల్లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి నెయ్యి దీపంతో పాటు పూలను సమర్పించాలి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇలాంటి చిన్న చిన్న పనుల వద్ద లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన దైనందిన జీవితంలో కొన్ని పద్ధతులను, అలవాట్లను మార్చుకోవడం ద్వారా అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చు. నిత్యం నిర్మల మనస్సు, భక్తిభావంతో ఈ తేలికపాటి నియమాలను పాటిస్తే జీవితంలోని దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+