డోంట్ మిస్ ఔట్: ఫాల్గుణ అమావాస్య- అనేక దోషాలకు సెలవ్

ఫాల్గుణ అమావాస్య 2026: హిందూ క్యాలెండర్‌లో అమావాస్యకు ఎంతో విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పితృ దేవతలకు సంబంధించిన పూజలు, శ్రాద్ధ కర్మలు చేయడానికి ఇది ఒక పవిత్ర దినంగా పరిగణిస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే శక్తిమంతమైన అమావాస్య ఇది. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నాడు వస్తుంది.

ఈ పవిత్ర దినాన్ని దర్శ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం ముగింపును స్పష్టంగా సూచిస్తుంది. దేశవ్యాప్తంగా భక్తులు పితృ దేవతల ఆత్మ శాంతికోసం దానధర్మాలు చేస్తూ, ప్రత్యేక పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. పూజలు, ఆచారాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తిథి సమయాలు ఖచ్చితంగా తెలుసుకోవడం అవసరం.

Falguna Amavasya 2026 Rituals For Pitru Dosh Relief And Auspicious Timings highlighting rituals

దృక్ పంచాంగ్ ప్రకారం ఫాల్గుణ అమావాస్య తిథి ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5:34 నిమిషాలకు ప్రారంభమౌతుంది. 17వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ముగుస్తుంది. తిథి మంగళవారం సూర్యోదయం వేళ ఉన్నందున, ప్రధాన పూజలు, ఇతర కార్యక్రమాలు ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:07 వరకు, అమృత కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:28 నుండి 3:13 వరకు, గోధూళి ముహూర్తం సాయంత్రం 6:10 నుండి 6:36 వరకు వర్తిస్తాయి.

హిందూ ధర్మం ప్రకారం, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధ కర్మల కోసం ఈ రోజు ప్రత్యేకంగా భావిస్తారు. నీరు, నువ్వులతో తర్పణాలు ఇవ్వడం ద్వారా మరణించిన వారికి శాంతి లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాద బలం కుటుంబానికి లభిస్తుందని నమ్ముతారు. పితృ దేవతలను పూజించడమే కాకుండా, కాలసర్ప దోష పూజ చేయడానికి కూడా అమావాస్య శుభప్రదమైనదిగా పరిగణిస్తారు.

జ్యోతిష్యపరంగా ఈ దోషంతో బాధపడే భక్తులు దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ రోజున నివారణ పూజలు చేయాలని పండితులు సూచిస్తారు. అమావాస్య ఏ రోజున వస్తుంది అనే దానిపై దాని ప్రాముఖ్యత మారుతుంది. ఉదాహరణకు, సోమవారం నాడు వచ్చే అమావాస్యను 'సోమవతి అమావాస్య' అని, శనివారం నాడు వచ్చే అమావాస్యను 'శని అమావాస్య' అని పిలుస్తారు.

2026 ఫాల్గుణ అమావాస్య మంగళవారం నాడు వస్తుంది. దీన్ని దర్ష అమావాస్యగా దీనిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ పవిత్ర రోజున ఇంటిని, దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. మాంసం, మద్యపానం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస ఆహారాలను త్యజించాలి. చెడు ఆలోచనలు, వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

జుట్టు, గోళ్లు కత్తిరించడం, వివాహం, గృహప్రవేశం, ముండనం, నిశ్చితార్థం వంటి ఎటువంటి శుభకార్యాలను ఈ రోజున చేపట్టకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించడం, పెద్దలు, మహిళలను గౌరవించడం తప్పనిసరి. తులసి ఆకులను కోయడం కూడా మంచిది కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+