గురుపౌర్ణమి నుంచి ఈ రాశుల తలరాత పూర్తిగా మారిపోయింది
ఈరోజే గురుపౌర్ణమి. వ్యాస భగవానుడి జన్మదినోత్సవాన్ని గురుపౌర్ణమిగా జరుపుకుంటాం. ఆషాడ మాసంలో ఈ పౌర్ణమి వస్తుంది. సూర్యుడు, గురువు కలిసి మిథునరాశిలో గురు ఆదిత్య రాజయోగాన్ని, చంద్రుడిపై గురువు దృష్టి పడి గజకేసరి రాజయోగం ఏర్పడుతున్నాయి. అలాగే రాక్షసులకు గురువైన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తుండటంతో మాలవ్య రాజయోగం ఏర్పడింది. దీంతోపాటు అదనంగా ఇంద్ర యోగం కూడా ఏర్పాటైంది.
వృశ్చిక రాశి
ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. కొత్త ఉద్యోగాన్ని సాధిస్తారు. సమస్యలన్నీ తీరిపోవడంతో ప్రశాంతంగా ఉంటారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. కన్న తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనేక ఆర్థిక ప్రయోజనాలు వీరికి కలుగుతాయి.

ధనుస్సు రాశి
వీరికి గురుపౌర్ణమి బాగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. అదృష్టం వల్లే అలా జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది.
వృషభ రాశి
వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అన్నీ సానుకూల మార్పులే ఉంటాయి. జీవితం బాగుంటుంది. విజయాన్ని అందుకుంటారు. గురుపౌర్ణమి నుంచి వీరి తలరాత మారిపోతోంది.
మిథున రాశి
వీరికి బాగా కలిసివస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి పరంగా బాగా కలిసివస్తుంది.
తులా రాశి
కొత్త పనులు ప్రారంభించాలని ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. వీరు వ్యాపారంతోపాటు కొత్త కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications