ఈ నెల 30 నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలకు, తర్కానికి, లెక్కలకు, వ్యాపారానికి కారకుడు. ఈనెల 30వ తేదీన సూర్యుడు పరిపాలిచే సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుందంటున్నారు పండితులు. ఈ ప్రభావంతో సెప్టెంబరు నెల మొత్తం మూడు రాశులవారికి అదృష్టం పట్టుకుంటోంది. వారికి బుధుడి వల్ల ఏవిధంగా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
సింహరాశి
అనుకున్న పనులు వెంటనే పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని ఈ రాశివారు సొంతం చేసుకుంటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మంచి ఆర్థిక స్థితిని కైవసం చేసుకుంటారు.

వృశ్చిక రాశి
ఈ సమయంలో ఈ రాశివారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అన్నిరకాల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని పూజించాలి. దీనివల్ల అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవుతాయి.
తులారాశి
వృత్తి పరమైన జీవితంలో విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వారు ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసివచ్చు మంచి విజయంతో దాన్ని పూర్తిచేయగలుగుతారు. గతంలోకంటే ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నలుగురికి సాయం చేస్తారు.
మీనరాశి
వ్యాపారాలు మొత్తం లాభసాటిగా మారతాయి. డబ్బులు రావడంవల్ల వచ్చినవాటిని ఇతర వ్యాపారాలవైపు మళ్లిస్తారు. భారీ లాభాలను గడిస్తారు. అన్ని సమస్యల నుంచి ఈ సమయంలోనే పరిష్కారం లభిస్తుంది. కెరీర్ కు సంబంధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో వారి మాటలను జాగ్రత్తగా గమనించడంవల్ల మీకు ఎక్కువ జ్ఞానం లభిస్తుంది.












Click it and Unblock the Notifications