మకర రాశి, కుంభ రాశి, మీన రాశి 2026 సెప్టెంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope: గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి మకర రాశి, కుంభ రాశి, మీన రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.
మకర రాశి (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
మకర రాశి వారికి సెప్టెంబరు నెల అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఉద్యోగులకు పనివేళల్లో పురోగతి లభిస్తుంది. సరైన ప్రణాళికలతో కొత్త బాధ్యతలను విజయవంతంగా చేపడతారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తే సహకారం, మద్దతు అందుతుంది. ధన లాభం పెరిగే సూచనలున్నాయి. బహుళ మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. అయితే, అవసరం లేని ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. వ్యక్తిగతమైన రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. శనిదేవునికి శనివారం రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభకరం.

కుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కుంభ రాశి వారికి సెప్టెంబరు నెల సహనం, ఆర్థిక క్రమశిక్షణ అవసరమయ్యే కాలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కారణంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. వృత్తి రంగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆవేశపడి ఉద్యోగాలు మారడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు. సహనంతో వ్యవహరిస్తే అను అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారు. రాబడి ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అకస్మాత్తుగా పెరుగుతాయి. పాత అప్పులు తీర్చడంపై దృష్టి పెట్టండి; కొత్తగా ఎవరికీ హామీలు ఇవ్వడం గానీ, వ్యాపార విస్తరణకు అప్పులు చేయడం గానీ చేయకండి. మాట పరుషంగా ఉండకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ నమ్రతతో వ్యవహరిస్తే సమస్యలు సర్దుమణుగుతాయి. మానసిక ఆందోళన, శారీరక అలసట లేదా కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. దినచర్యలో తగినంత విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం, శనివారాల్లో నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేయడం వల్ల దోష ఉపశమనం లభిస్తుంది.
మీన రాశి (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశి వారికి సెప్టెంబరు నెల అత్యంత శుభప్రదంగా, విజయవంతంగా ఉండబోతోంది. రాశ్యధిపతి గురుడి బలమైన స్థానం వల్ల అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధమైన కృషికి తగిన గుర్తింపు, ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూరప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు సఫలమవుతాయి. ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యలు, పాత టెన్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి లేదా నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంట్లో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణ మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత లేదా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దక్షిణామూర్తి లేదా గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం, గురువారం రోజున పసుపు రంగు వస్తువులు లేదా శనగలు దానం చేయడం శ్రేయస్కరం.














Click it and Unblock the Notifications