ఈ రాశులవారిపై శనిదేవుడి చల్లని చూపు.. తర్వాత కుబేరులే
జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు కుంభరాశిలో ఉన్నాడు. జూన్ 17వ తేదీ రాత్రి 10.48 గంటలకు తన రాశిలో తిరోగమనాన్ని ప్రారంభిస్తాడు. నవంబరు 4వ తేదీ ఉదయం 8.26 గంటల వరకు కుంభరాశిలోనే ఉంటాడు. తన రాశిలో వెనక్కు కదిలే తిరోగమనంవల్ల అనేక రాశిచక్ర గుర్తులకు ప్రయోజనం కలగనుంది. కుబేరుడి సంపద ఏ రాశులవారికి అందుతుందో తెలుసుకుందాం.
మిధునరాశి : జ్యోతిష్యం ప్రకారం గత సంచారంలో శని ఫలితాలివ్వాలనుకున్నాడు. అయితే ఇప్పుడు వాటినివ్వడం ప్రారంభిస్తాడు. విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అందుకు తగ్గట్లుగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుంది. తండ్రి ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టాలి. ఇది కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. పూర్వీకుల నుంచి ఆస్తి పొందుతారు. అంతేకాదు.. రాదు అనుకున్న మొండి బకాయి డబ్బులు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులకు బదిలీ ఉంటుంది.

సింహ రాశి : శని 7వ ఇంటిలో ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగంతోపాటు వ్యాపారాల్లో లాభపడతారు. కొన్ని కారణాల వల్ల ఏదైనా పని నిలిచిపోయినట్లయితే, అది ఈ సమయంలో పూర్తవుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని వెచ్చిస్తారు. మీ కష్టానికి తగిన ఫలాలు లభించే రోజు వచ్చింది. అంతేకాకుండా డబ్బులను అప్పు రూపంలో ఎవరికీ ఇవ్వకుండా ఉండటం మంచిది.
ధనుస్సు రాశి : వీరి ఎన్నో కలలు నెరవేరుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది. పదోన్నతితోపాటు ఇంక్రిమెంటు కూడా వస్తుంది. తోబుట్టువులతో అనుబంధాలు బలపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయాన్ని సాధిస్తారు. బాగా శ్రమపడటంద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications