సరిగ్గా 3 నెలలు ఆగండి... ఆ తర్వాత ఈ రాశులకు తిరుగులేని రాజయోగం
నవగ్రహాల్లో కీలకమైన.. దేవతల గురువైన బృహస్పతి ఏడాదికోసారి తన రాశిని మారుస్తుంటాడు. ఈ ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో గురుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. సంతానం, వివాహం, ఆధ్యాత్మికత, సంపద, శ్రేయస్సుకు కారకుడైన గురుడు రాశిని మార్చడంవల్ల కొన్ని రాశులవారు రాజయోగాన్ని అనుభవిస్తారు. ఏడాదిపాటు మిథునరాశిలో సంచరించే బృహస్పతి దయవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథున రాశి
చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. కొత్త ప్రాజెక్టుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం వీరికి ప్రత్యేకంగా నిలిచిపోతుంది. భార్యాభర్తలకు సంతాన యోగం ఉంది. పెళ్లికానివారికి పెళ్లి అవుతుంది. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు ఇతరులవద్ద మంచి గౌరవం దక్కుతుంది. వ్యాపారస్తులు భారీ ఆర్డర్లను దక్కించుకుంటారు. పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దల నిర్ణయాన్ని అమలు పరచాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బృహస్పతిని పూజించాలి.

మేషరాశి
వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ యోగాన్ని బృహస్పతి కలిగిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు నెమ్మదిగా వెళ్లడం ఉత్తమం. వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి.
సింహ రాశి
వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగం చేస్తున్నచోట వేతనాలు పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. పిల్లల వల్ల అభివృద్ధి చెందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసిరావడంతో అప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి సంపూర్ణమైన సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితం మాత్రం ఈ రాశివారిలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది.












Click it and Unblock the Notifications