మే 19న అమావాస్య దోషం.. ఈ రాశులవారు జాగ్రత్త
ప్రతి గ్రహం ఒక నిర్ణీత సమయంలో తన రాశిని మారుస్తుంటుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మే 15న వృషభరాశిలోకి వస్తున్నాడు. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి రాశి అయిన వృషభరాశిలో సూర్యచంద్రుల కలయిక ఏర్పడబోతోంది. ఈ రెండింటి సంయోగం వల్ల అమావాస్య దోషం అనే అశుభకరమైన యోగం ఏర్పడుతోంది. మే 19న ఏర్పడబోతున్న ఈ అమావాస్య దోషం మూడు రోజులు ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఇక్కట్లు కలగనున్నాయి. ఆ దురదృష్టకరమైన రాశులేంటో తెలుసుకుందాం.
వృషభరాశి : ఈ రాశిలో సూర్యచంద్రుల కలయికవల్ల అమావాస్య దోషం ఏర్పడుతోంది. ఇది అశుభకరమైన యోగం. వృషభరాశివారిని ఇక్కట్లకు గురిచేయబోతోంది. చేసే ప్రతి పనిలోను ఆటంకాలు ఏర్పడతాయి. కెరీర్ ముందుకు సాగడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్రమత్తత అవసరం.

తుల రాశి : అమావాస్య దోషం తులారాశి వారికి పలు సమస్యలను సృష్టిస్తోంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి. చర్మ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు. శత్రువులు మీకు హాని కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అమావాస్య దోషం హాని కలిగిస్తుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఏ పని చేసినా అందుకు ఆటంకాలేర్పడతాయి. దీనివల్ల తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. పెద్దమొత్తంలో డబ్బులు నష్టపోతారు.












Click it and Unblock the Notifications