మహాశివరాత్రికి ఒకరోజు ముందు ఈ రాశులవారు కుబేరులవుతారు
జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు, శుక్రుడితోపాటు మరికొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఏడోతేదీన శుక్రుడు, బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు. మీనరాశిలో బుధుడు, రాహువు కలయిక జరుగుతుంది. కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశించనుండగా, రాహువు కూడా ఈ రాశిలో అప్పటికే సంచారం చేసివుంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి సంపద కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
కన్యారాశి: ప్రభుత్వరంగంలో పనిచేస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు వీరికి సహకరిస్తాయి. పరమేశ్వరుడిని పూజించడంవల్ల ఆ పరమాత్ములైన తల్లిదండ్రుల అనుగ్రహం లభిస్తుంది. దీనివల్లే ధనం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉండటంవల్ల, ఆర్థికంగా కలిసిరావడంవల్ల గతం నుంచి వెంటాడుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరింపచేసుకుంటారు.

మిథున రాశి: పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అందుబాటులోకి ధనం రావడంవల్ల అప్పుల బాధ నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది ఎంతో ముఖ్యమైన సమయంగా మారుతుంది. ఈ సమయంలో చేసిన పనులన్నీసానుకూల ఫలితాలను ఇస్తాయి.
సింహరాశి: శుక్రుడి సంచారం వీరికి బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలి.












Click it and Unblock the Notifications