66 ఏళ్ల తర్వాత పారిజాత యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల, మరికొన్నిసార్లు ప్రతికూల యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల రాశులవారు ప్రభావితులవుతుంటారు. వ్యక్తి జాతకంలో తన రాశికి అధిపతి అయిన గ్రహం సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు పారిజాత యోగాన్ని ఏర్పరుస్తుంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈనెల 5వ తేదీన బృహస్పతి తన సొంత రాశి అయిన మకర రాశిలోకి రానుంది. దీనివల్ల ఏయే రాశులు ప్రభావితమవుతారు? ఎటువంటి ఫలితాలను పారిజాత యోగం ద్వారా పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభరాశి
ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచిస్తుంటారు. వ్యతిరేక కోణంలో ఆలోచనలకు తావివ్వరు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలను సాధిస్తారు. ఈ రాశివారు కూడా విందులు, వినోదాల్లో పాల్గొని సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీరి ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్ణయాత్రలకు వెళతారు.

మేషరాశి
ఈ రాశివారికి వారు కోరుకున్న యువతితో వివాహం కుదురుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి బాగా కష్టపడతారు. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు. శత్రువులు కూడా మీ పనితీరుతో మీకు మిత్రులుగా మారతారు. కోర్టు సంబంధిత కేసుల్లో తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది. ఆస్తులు కలిసివస్తాయి. తల్లిదండ్రులవైపు నుంచి, భార్యవైపు నుంచి ఆస్తులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆదాయం పెరగడానికి ఇతర మార్గాలు కూడా దొరుకుతాయి.
కన్యారాశి
ఈ రాశివారు ఎక్కువగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవితాన్ని లగ్జరీగా గడుపుతుంటారు. అనుకోకుండా సమాజంలో గౌరవం అనూహ్యంగా పెరుగుతుంది. గతంలో రాదు అనుకొని వదిలేసిన డబ్బు చేతికి వస్తుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలు అందుతాయి. ఈ వ్యాపారంలో ఉన్నవారు అమ్మకాలు, కొనుగోలు ద్వారా కూడా భారీగా డబ్బును సంపాదిస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications