ఈ ఆకులో భోజనం చేయండి... జాతకంలో గ్రహాలు బలపడతాయి!
అరటిచెట్టు ఎంతో పవిత్రమైనది. దక్షిణ భారతీయులు చాలామంది వేడుకలు ఏవి వచ్చినా అరటి ఆకుల్లో అతిథులకు భోజనాలు వడ్డిస్తారు. ఇలా అరటి ఆకులో భోజనం చేయడంవల్ల ఆరోగ్య ప్రయోజనాలేకాదు.. జాతకంలో గ్రహాలు కూడా బలపడతాయి. వైద్యపరంగా, జ్యోతిష్యం పరంగా అనేక లాభాలున్నాయి. దీనివెనక ఉన్న కారణాలను తెలుసుకుందాం. ముక్కుమీదే కోపం ఉండే దుర్వాసమునిని ఒకరోజు నిద్ర పోతుండగా అతని భార్య బాగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆగ్రహించిన దుర్వాసుడు తన భార్యను అరటిచెట్టు అవ్వు అంటూ శపిస్తాడు. అయితే అతని భార్య తనను పవిత్రమైన వృక్షంగా అందరూ పూజించేలా వరం ఇవ్వమని అభ్యర్థిస్తుంది. దీంతో దుర్వాసుడు భార్య కోరికను తీరుస్తాడు. పురాణాల ప్రకారం ఆరోజు నుంచి అరటిచెట్టు ఎంతో పవిత్రమైందిగా మారింది.
ఆకులో భోజనం చేస్తే అదృష్టం
వాస్తవానికి అరటి ఆకులో భోజనం చేస్తే అదృష్టం కలుగుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. గ్రహాలకు రాకుమారుడైన బుధుడు, కుజుడు, బృహస్పతికి అరటిచెట్టుతో అనుబంధం ఉంటుంది. అలాగే దీనికి ఉండే పసుపు రంగు గురువుకు సంబంధించినది. అరటి పండు కుజుడిది. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడంవల్ల జాతకంలో బుధుడు బలపడతాడు. అలాగే అరటిచెట్టుకు నీరు పోయడంవల్ల మంచి ఫలితాలు కలగడంతోపాటు అరటిపండును ఇతరులకు దానమిస్తే జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

మనిషి అరచేతిని పోలివుంటాయి
అరటి ఆకులు ఉండే రూపం, అందులోని రేఖలు మనిషి అరచేతిని పోలివుంటాయి. అరటిపండులో గింజలు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. మన ఆత్మ కర్మ రహితమని అర్థం. శాస్త్రీయంగా అరటి ఆకులు అనేక ఔషధ విలువలను కలిగివుంటాయి. ఆచార వ్యవహారాల్లో అరటి ఆకులనే ఉపయోగిస్తారు. వీటిలో భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత భక్తులకు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో వంట చేయడానికి అరటి ఆకులను ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలను అరటి ఆకుతో చుడతారు. వాటిమీద దేవతామూర్తులు ప్రసాదం స్వీకరిస్తారని నమ్మకం. బెంగాలీలు అరటి చెట్టు విఘ్నేశ్వరుడి భార్య అని నమ్ముతారు. అరటిచెట్టులో మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నివాసం ఉంటాడని నమ్మకం. భక్తితో నిత్యం అరటిచెట్టుకు పూజలు జరిపించేవారు ఉన్నారు.












Click it and Unblock the Notifications