జులై 19 నుండి శని మంగళ యోగం: ఈ రాశులవారు సంపన్నులవుతారు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. జులై 19వ తేదీన ఆదివారం రోజు రాత్రి శని, కుజ గ్రహాల మధ్య శుభప్రదమైన షడ్కోణం ఏర్పడనుంది. ఈ అరుదైన గ్రహ సంయోగం కారణంగా కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. శని, మంగళ గ్రహాల మధ్య శుభప్రదమైన షడ్కోణంతో శుభ ఫలితాలు పొందే రాశుల గురించి తెలుసుకోండి.

మేషరాశి

మేషరాశి వారికి ఈ యోగం చాలా మంచిది. ఈ సమయంలో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. మేషరాశి వారి ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు వస్తాయి.

Saturn Mars Yoga July 19th an auspicious Shadkonam aspect will form between the planets gives luck

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు శని, కుజ గ్రహాల మధ్య శుభప్రదమైన షడ్కోణం లాభాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత, ఆర్ధిక లాభాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ అరుదైన పరిణామం కలిసి వస్తుంది.

మకరరాశి

మకరరాశి జాతకులకు శని, కుజ గ్రహాల మధ్య ఏర్పడే షడ్కోణం మంచి ఫలితాలను ఇస్తుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. ఈ సమయంలో కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. ఇది మకరరాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

నేటినుండి గురు సూర్యుల యుతితో మీరు నక్కతోక తొక్కుతారు!
నేటినుండి గురు సూర్యుల యుతితో మీరు నక్కతోక తొక్కుతారు!

కుంభరాశి

కుంభరాశి జాతకులను విజయాలు వరిస్తాయి. ఈ సమయంలో కుంభరాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీరి పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+