కుంభరాశిలో శని ఉదయం: ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాలు; భారత్ బలోపేతం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభావాలకు కారణమవుతుంది మార్చి 18వ తేదీన శనిగ్రహం కుంభరాశిలో ఉదయిస్తుంది. కుంభరాశిలో శని గ్రహ ఉదయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది.కుంభ రాశిలో ఇప్పటికే సూర్యుడు ఉండడం వల్ల మార్చి 18వ తేదీన మరో పెద్ద గ్రహమైనటువంటి శని ఉదయం ఏడు గంటల 49 నిముషాలకు కుంభరాశిలో ఉదయించనుంది.
కుంభరాశిలో శని పెరుగుదల సానుకూలమైన దృశ్యం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావాలు సానుకూలంగా ఉంటాయి. కుంభ రాశిలో శని ఉదయించడం వల్ల మనదేశంలోని న్యాయవ్యవస్థ బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే శని న్యాయాధిపతి, క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి న్యాయ వ్యవస్థ పై శని ఉదయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.

అంతేకాదు కుంభరాశిలో శని ఉదయం వల్ల పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించడానికి విధివిధానాలను భారత ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల ప్రజలు మరియు ప్రభుత్వం ఆందోళన చెందుతుందని ఇదే సమయంలో వాయు కాలుష్య నియంత్రణకు కూడా కఠినమైన చర్యలు తీసుకునే అవసరం ఉందని చెబుతున్నారు.
అంతేకాదు కుంభ రాశిలో శని ఉదయం వల్ల కొన్ని దేశాలలో సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి కొన్ని పరిమితులు విధించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతే కాదు శాంతిని కాపాడడం కోసం కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయడానికి ప్రపంచంలోని దేశాలు కఠినమైన చర్యలను తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఇదే సమయంలో భారతదేశం యొక్క వ్యాపార ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆర్థిక రంగం బలోపేతం అవుతుందని చెబుతున్నారు. భారతదేశం ఆగ్నేయ దేశాల నుండి వ్యాపార అవకాశాలను ఆహ్వానిస్తుందని, దేశంలో వ్యాపార, ఉపాధి అవకాశాలను తీసుకురావడానికి ఇతర దేశాలతో భారతదేశానికి సంబంధాలు బలపడతాయని చెబుతున్నారు. కుంభ రాశిలో శని ఉదయం కారణంగా తోలు, ఇనుము, ఉక్కు, పెట్రోలియం మరియు మైనింగ్ పరిశ్రమలు వ్యాపారంలో స్థిరమైన పెరుగుదలను చూస్తాయని, ఆర్థిక లాభాలు వస్తాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications