త్వరలో వీరి జీవితంలో నిప్పులు కురిపిస్తా అంటున్న సూర్యుడు.. జాగ్రత్త!
వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలకు రాజుగా సూర్యభగవానుడిని పిలుస్తారు. సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. సూర్యుడు రాశి సంచారం మాత్రమే కాదు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. సూర్య సంచారం కొన్ని రాశుల వారికి రాజయోగాలు కలిగిస్తే, కొన్ని రాశుల వారికి కష్టాలను, నష్టాలను కలిగిస్తుంది.
సూర్యుడి నక్షత్ర సంచారం
ప్రస్తుతం సూర్యుడు కృత్తికా నక్షత్రం నాలుగో పాదంలో సంచరిస్తున్నాడు. త్వరలో సూర్యుడు మే 25వ తేదీన రోహిణి మొదటి పాదం లోకి ప్రవేశిస్తాడు. రోహిణి మొదటి పాదంలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
రోహిణి నక్షత్రంలో సూర్య సంచారంతో మిధునరాశి జాతకులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది .ఈ సమయంలో మిధున రాశి వారికి వారి పైన నమ్మకం కాస్త తగ్గుతుంది. పనిచేసే చోట ఇబ్బందులు ఎదురుకావచ్చు. మిధున రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తులారాశి
సూర్యుడు రోహిణి నక్షత్రం లోకి సంచారం చేయడం వల్ల తులా రాశి జాతకులు ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులారాశి జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తత అవసరం.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు సూర్యుడు రోహిణి నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇబ్బందులు వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి మరికొంత కాలం నిరీక్షించ వలసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications