వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాస్త్రీయ ప్రమాణికంగా ఎలాంటి నీళ్ళు తాగితే ఆరోగ్యకరం

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా రోజు మనం ఎలాంటి నీళ్ళను తాగుతున్నాము అనే విషయం పరిశీలించుకోవాలి. ఏ పాత్రలో నీళ్ళు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఏ పాత్రలో నీళ్ళు తాగితే అనారోగ్యంనకు గురుచేస్తాయి అనేది తెలుసుకుందాం. మన శరీరంలో మూడు వంతుల నీళ్ళ శాతంతో కూడుకుని ఉంటుంది.

మానవుని శరీరంలో దాదపు 70 శాతం బరువు నీరే. మనిషి శరీరంలోని 30 లీటర్ల నీరుంటుందంటే మనకు నమ్మబుద్ధికాదు. గుండె జబ్బు, మధుమేహం ఉన్నవాళ్ళు మరీ ఎక్కువ నీళ్ళను త్రాగాలి. నీళ్ళు జీర్ణక్రియకు బ్రహ్మాండగా తోడ్పడుతుంది. నీరే కనక లేకపోతే శరీరంలో కొన్ని రకాల రసాయనిక క్రియలను నిర్వర్తించలేము. నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దం చేస్తుంది. ముఖ్యంగా నీళ్ళు కీళ్ళలో నీరు కందేనలాగా ఉపయోగపడి అవి అరిగిపోకుండా కాపాడుతాయి.

మనం రోజు సామాన్యంగా నీరు త్రాగే ముందు అవి ఏలాంటివో చూసుకోవాలి.
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి
అని లీటర్ నాలుగు రూపాయల నుండి ఐదు రూపాయలు పెట్టి కొంటున్నాం.

The story about significance healthy water

పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా ఇరవై రూపాయలు అమ్ము తున్నారు.కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలా మందిలో ఉంది.ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.దీని వలన ప్రమాదమే కాని ఉపయోగంలేదు.రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నాము.ఇదంతా ఎందుకు చేస్తున్నారు.అంటేఆరోగ్యం కోసం అంటారు. అందరూ రోగాల బారిన పడ కూడదు. అను కుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి.దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.

ఇంతకీ విషయం ఏంటంటే!భారత దేశంలో ఉన్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.అందులో ఇది ఒకటి.నీటిని శుభ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి, ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి.కానీ, ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.

48 గంటలకి దానికి మలి రెట్టింపు అయింది అని కను గొన్నారు.ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా అని.

కాబట్టి వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీల్లు చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.

కనుక రాగి, ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.ఆరోగ్యాన్ని కాపాడు కోండి.నీటి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తాగే నీటిని మరగ కాచుకుని తాగాలి.మన అరోగ్యం అత్యంత ముఖ్య పాత్ర వహించే నీటిని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆనారోగ్యం పాలవడం ఖాయం.

English summary
The Astrologer told about the story about significance healthy water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X