దీపావళి రోజు నుంచి కుబేరులవుతున్న రాశులు వీరే
జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాలు కలుసుకున్నప్పుడు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. అక్టోబరు 20వ తేదీన శనిదేవుడు, బుధుడు కలుసుకోనుండటంవల్ల శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీపావళి రోజు నుంచి అధిక లాభాలు, విశేష ప్రయోజనాలు ఏ రాశులు పొందబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభరాశి
సమాజంలో గౌరవం కలుగుతుంది. హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేసి అద్భుతమైన లాభాలను గడిస్తారు. వ్యాపారాలు చేసేవారికి గణనీయమైన లాభాలు వస్తాయి. దీనివల్ల మంచి హోదా దక్కుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. నవపంచమి రాజయోగంతో ఆర్థికంగా బలపడతారు. పదిమందికి సాయం చేసే స్థాయికి చేరుకుంటారు. అనుకోకుండా ఆర్థిక లాభాలున్నాయి.

కర్కాటక రాశి
ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయి. కొన్నిరకాల శుభవార్తలను అందుకుంటారు. గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దీపావళి నుంచి వీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.
మకర రాశి
వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలున్నాయి. దీర్ఘకాలికంగా వస్తున్న నష్టాలన్నీ వ్యాపారాల్లో తొలగిపోతాయి. మంచి లాభాలను గడించడం ప్రారంభమవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపడతారు. ఒకరకంగా ఈ రాశివారికి రాజయోగం పడుతుందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications