సూర్య గ్రహణం తర్వాత ఈ రాశులకు అదృష్టం పట్టుకుంది

ఏప్రిల్ 8న ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. జ్యోతిష్యం ప్రకారం మీనరాశి, స్వాతి నక్షత్రంలో ఇది ఏర్పడింది. మనదేశంలో ఇది కనిపించనప్పటికీ మేషం, వృషభం, సింహం, కుంభం, మీనం , ధనుస్సు రాశులవారిపై ప్రభావం ఉంటుంది. దీనివల్ల వీరు అదృష్టవంతులు అవుతారు. వారి వివరాలను తెలుసుకుందాం.

మేషం
సూర్య గ్రహణంవల్ల అధిక ఆదాయం వస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంది. ప్రధానమైన సమస్యలన్నీ తొలగిపోవడంవల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

these zodiac signs are very lucky due to solar eclipse 2024

వృషభం
వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో, ప్రేమ భాగస్వామితో ఆనందకర జీవితాన్ని గడుపుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. దీనివల్ల కెరీర్ లో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

సింహం
ఆదాయం పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో లాభదాయకమైన సంబంధాలు ఏర్పడటంతోపాటు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

ధనస్సు
వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఉంటే వాటినుంచి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

కుంభం
అనుకున్న పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. గ్రహబలం మంచిగా ఉంటుంది. అదృష్ట యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది.

మీనం
ప్రధానమైన లావాదేవీలన్నీ వెంటనే పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో లాభదాయకమైన సంబంధాలను ఏర్పడతాయి. దీనివల్ల మంచి రాబడిని పొందుతారు. వ్యాపారాలు కూడా లాభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+