ఉగాది నుంచి రాజయోగాలు.. ఈ రాశులకు ధనయోగం
క్రోధి నామ సంవత్సరానికి అధిపతిగా కుజుడు ఉంటాడు. మంత్రిగా శనిదేవుడు వ్యవహరిస్తాడు. కొత్త ఏడాదిలో శక్తివంతమైన మూడు రాజయోగాలు ఏర్పడనున్నాయి. అమృత సిద్ధి యోగం, శశ రాజయోగంతోపాటు మరో రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం అమృత సిద్ధ యోగం అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వీటివల్ల కొన్ని రాశులవారికి కొత్త సంవత్సరం ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఏడాది పొడవునా వీరికి అదృష్టం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఏయే రాశులవారికి ఎన్ని ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లాభాలున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు శుభవార్తను వింటారు. ఈ సంవత్సరంలో వీరు ఎటువంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ధనలాభం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

మిథున రాశి
పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. విదేశాలకు వెళ్లాలనుకున్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మిథునరాశివారికి ఈ ఏడాది విపరీతమైన ధనలాభాలున్నాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
సింహరాశి
మిశ్రమ లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు వేతనం పెరుగుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి అంతా శుభ్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సంతోషం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది. అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications