డైనోసార్ల కాలం నాటి వింత జీవి.. సముద్ర గర్భంలో అరుదైన రహస్యం!

వింత ఆకారంతో, డైనోసార్ల కాలం నాటి చరిత్రను దాచుకున్న అత్యంత అరుదైన 'గాబ్లిన్ షార్క్' (Goblin Shark)ను శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో తొలిసారి సజీవంగా కెమెరాలో బంధించారు. దాదాపు 125 మిలియన్ సంవత్సరాల నుంచి భూమిపై మనుగడ సాగిస్తూ.. ఇప్పటికీ రూపం మారకుండా ఉన్నందున వీటిని 'సజీవ శిలాజాలు' (Living Fossils) అని పిలుస్తారు.

ఇప్పటివరకు ఈ రకం చేపలు మత్స్యకారుల వలలకు చిక్కి, పైకి తెచ్చేటప్పుడు ఒత్తిడి తట్టుకోలేక చనిపోగా చూశారే తప్ప, నడి సముద్రంలో అవి ఎలా బతుకుతాయనేది ఎవరికీ తెలియదు. యూనివర్సిటీ ఆఫ్ హవాయి పరిశోధకులు నేరుగా సముద్ర గర్భంలోకి రోబోటిక్ కెమెరాలను పంపి, వీటి జీవన విధానాన్ని తొలిసారి లైవ్‌గా రికార్డ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

పసిఫిక్ మహాసముద్రంలో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వేర్వేరు ప్రాంతాలలో ఈ గాబ్లిన్ షార్క్‌లు తిరుగుతూ కనిపించాయి. ఒకటి జార్విస్ దీవుల సమీపంలోని నీటి అడుగున ఉన్న పర్వతం వద్ద కనిపించగా, మరొకటి అత్యంత లోతైన 'టోంగా ట్రెంచ్' వద్ద రికార్డయింది. గతంలో ఇవి కేవలం జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా తీరాలకే పరిమితమనుకున్న శాస్త్రవేత్తలకు.. ఈ తాజా లొకేషన్ల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఇవి చాలా విస్తృతంగా విస్తరించి ఉన్నాయనే కొత్త విషయం తెలిసింది.

For the First Time Ever a 125 Million Year Old Goblin Shark Filmed Alive in Deep Ocean Watch Video Here

700 మీటర్ల లోతులో కొత్త రికార్డు

టోంగా ట్రెంచ్ వద్ద ఈ షార్క్ రికార్డయిన లోతు చూసి పరిశోధకులు సైతం నోరెళ్లబెట్టారు. సాధారణంగా ఇవి తిరిగే లోతు కంటే దాదాపు 700 మీటర్లు ఇంకా లోపలికి వెళ్లి ఇవి సంచరిస్తున్నట్లు గుర్తించారు. గ్రేట్ వైట్ షార్క్, మాకో షార్క్ వంటి పవర్ ఫుల్ సొరచేపల జాతుల (Mackerel Sharks) చరిత్రలోనే ఇంతవరకు ఏ చేప కూడా వెళ్లనంత లోతులో ఈ గాబ్లిన్ షార్క్ ప్రయాణిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది.

సముద్ర గర్భంలో వింత జీవి విన్యాసాలు! అద్దం చూసి వేటాడే ఆక్టోపస్‌లు..
సముద్ర గర్భంలో వింత జీవి విన్యాసాలు! అద్దం చూసి వేటాడే ఆక్టోపస్‌లు..

పాత ఫుటేజీలోనే దాగున్న అసలు రహస్యం

చిత్రం ఏమిటంటే.. ఈ పరిశోధనల్లో మొదటి షార్క్‌కు సంబంధించిన వీడియో 2019 నాటి ఒక సముద్ర అన్వేషణ యాత్రలోనే రికార్డయింది. అయితే అప్పట్లో ఆ పాత రికార్డింగులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల హవాయి యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి ఆరోన్ జుడా ఆ పాత ఆర్కైవ్స్ వీడియోలను తిరిగి నిశితంగా పరిశీలించడంతో ఈ వింత చేప రహస్యం బయటపడింది.

సముద్ర గర్భం నుంచి అశుభ సూచకం: ప్రళయ చేప ప్రత్యక్షం!
సముద్ర గర్భం నుంచి అశుభ సూచకం: ప్రళయ చేప ప్రత్యక్షం!

ఆ తర్వాత జరిగిన మరో రీసెర్చ్‌లోనూ సజీవంగా ఉన్న రెండో షార్క్ కూడా దొరకడంతో ఈ పరిశోధనలు మరింత బలపడ్డాయి. మనకు ఇంకా తెలియని ఎన్నో వింతలు, రహస్యాలు సముద్ర గర్భంలో దాగి ఉన్నాయనడానికి ఈ గాబ్లిన్ షార్క్ లైవ్ వీడియోనే నిదర్శనమని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+