ఉగాది నుంచి ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం
శోభకృత్ నామ సంవత్సరం ముగిసి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 నుంచి చైత్రమాసం ఆరంభం అవుతోంది. మూడు రాజయోగాలతో కొత్త సంవత్సరం వస్తోంది. ఉగాదిరోజు నంచే చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధియోగం, ప్రీతి యోగం వచ్చాయి. వీటిని ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. వీటివల్ల సంపద పెరుగుతుంది. విజయాలు వరిస్తాయి. అదృష్టం తోడుంటుంది. ఉగాదిరోజు నుంచి ఏయే రాశులవారికి ఎంత ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.

మేష రాశి
మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది. సంపదను పొందుతారు. వ్యాపారం కోసం దూర ప్రయాణం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో లాభం ఉంది.
మిథునం
వీరికి ఆదాయం పెరుగుతుంది. పూర్వీకులిచ్చిన ఆస్తులను అమ్మడంద్వారా లాభాలు వస్తాయి. మంచి అవకాశాలు లభించనున్నాయి. విదేశాలకు వెళతారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు పూర్తిచేస్తారు. ఈ సమయం ఈ రాశివారికి ఒకరకంగా వరం అని చెప్పవచ్చు.
సింహ రాశి
కొత్త సంవత్సరం ఈ రాశివారికి మంచి కానుకను తెస్తోంది. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామి అన్ని పనుల్లో అండగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి శుభవార్తలు అందుతాయి. దాంపత్య జీవితం రొమాంటిక్ గా సాగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి పొందుతారు. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడి రానున్న కాలంలో మంచి లాభాలను తీసుకువస్తుంది.












Click it and Unblock the Notifications