29న బుధుడి సంచారంతో ఈ రాశులపై లక్ష్మీదేవి కనకవర్షం
జ్యోతిష్యం ప్రకారం జూన్ చివరి వారం చాలా శుభప్రదమైనది. 29వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. తన సొంత రాశి అయిన మిథునం నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. జులై 19వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు పూర్తవుతాయి. కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ఏ రాశివారికి ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి మిశ్రమ లాభాలున్నాయి. మీపై ప్రత్యర్థులు ఓటమిపాలవుతారు. వారినుంచి ఇప్పటివరకు మీకు ఎదురవుతున్న హాని తొలగిపోతుంది. స్నేహితులు శుభవార్తను వినిపిస్తారు. ఇంటిని లేదంటే కారును కొనుగోలు చేస్తారు. మానసికంగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు.

వృషభ రాశి
వీరికి విపరీతమైన ధనలాభం ఉంది. విశ్వాసం పెరిగి అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. క్లిష్ట పరిస్థితుల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మికంపై ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది.
కన్య రాశి
వీరికి ఆర్థిక లాభాలున్నాయి. ఆదాయంతోపాటు సంతోషం రెట్టింపు అవుతుంది. ఎటువంటి పనులు తలపెట్టినా విజయాలు సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సులువుగా పూర్తికావడంతో మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు.
తులారాశి
విపరీతమైన ధనలాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే సౌలభ్యం కలుగుతోంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న మనస్పర్థలు భార్యాభర్తల మధ్య తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications