నవ పంచమ రాజయోగంతో ఈ రాశులను కుబేరులను చేస్తున్న సూర్యస్వామి

నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్యం ప్రకారం కుజుడు, సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగివుంటాయి. ఈ రెండు గ్రహాలు కలిస్తే ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇలా ఏర్పడినదే నవపంచమ యోగం. ఈ రెండు గ్రహాల కలయికవల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుంది? ఎటువంటి యోగం ఏర్పడుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి వ్యాపారపరంగా వస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి. లాభాలను ఆర్జిస్తారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అంతా శ్రేయస్సు కలిగించే పనులే జరుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయం దక్కించుకుంటారు.

three zodiac signs income will increase and healthy life due to sun and mars conjunction

సింహ రాశి
నవపంచమ యోగంవల్ల అదృష్టం పూర్తిస్థాయిలో రెట్టింపు అవడంతోపాటు అన్నివిధాలుగా కలిసివస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలిగిపోయి ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారస్తులకు మాత్రం మంచి లాభాలున్నాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం దొరుకుతుంది.

తులా రాశి
అదృష్టం అనేది ఈ రాశివారికి విపరీతంగా పెరుగుతుంది. సంపాదన పెరగడంవల్ల జీవితంలో సంతోషం కలుగుతుంది. తులా రాశివారికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం ఎంతో బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు విజయం సాధిస్తారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ సమయంలోనే వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+