నవ పంచమ రాజయోగంతో ఈ రాశుల ఇంట్లో ధనలక్ష్మి తాండవం
గ్రహాల రాకుమారుడు బుధుడు. జ్ఞానానికి, వ్యాపారానికి, తెలివితేటలు, తర్కానికి కారకుడు. గ్రహాల్లో శనిదేవుడు న్యాయానికి ప్రతీక. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అత్యంత నెమ్మదిగా శనిదేవుడు రాశులను మార్చుకుంటుంటాడు. బుధుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశులను మార్చుకుంటాడు. ఇలా సంచారం చేసే క్రమంలో ఈ రెండు గ్రహాలు సంయోగం చెందుతున్నాయి. దీనివల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతోంది. శని, బుధుడి కలయిక వల్ల ఏర్పడే ఈ యోగంతో మూడు రాశులవారికి అదృష్టం బంకలా పట్టుకుంటోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి
ఉద్యోగస్థులకు వేతనం పెరిగి ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి కోరుకున్నచోటకు బదిలీ జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది. దీంతోపాటు అపారమైన సంపదను దక్కించుకుంటారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. దీంతో మీ దశ పూర్తిగి తిరిగిపోతుంది.

వ్యాపారంలో ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మాత్రం ఇది అత్యంత అనువైన సమయం. వ్యాపారస్తులు కొత్త వ్యాపారలను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి పదోన్నతి లభిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలను కలిగివుంటారు. ప్రతి పనిలోను విజయాన్ని సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశివారి ఆదాయంలో భారీ పెరుగుదల ఉండటంతోపాటు భారీగా సంపదను కూడబెడతారు. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం. పెట్టుబడి పెట్టి విజయాన్ని అందుకుంటారు. ఒకరకంగా ఈ రాశివారి జీవితంలో మంచి సమయం ప్రారంభమైందని చెప్పొచ్చు. అదృష్టం బంకలా పట్టుకుంది. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం.












Click it and Unblock the Notifications