కొద్దిరోజులు ఓపిక పట్టండి.. శనిదేవుడు మీ నెత్తిన పాలు పోస్తున్నాడు!
నవగ్రహాల్లో శనిదేవుడు న్యాయదేవుడు. ఆయన చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. చెడు పనులు చేస్తే మాత్రం రెట్టింపు ఫలితాలనిస్తాడు. మంచి చేసేవారికి అనేక శుభాలను ప్రసాదిస్తాడు. నవంబరు నెలలో మీనరాశిలోకి ప్రవేశించే శనిదేవుడి వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎందుకంటే రెండున్నర సంవత్సరాలపాటు ఒక రాశిలో శని సంచారం చేస్తాడు. గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శని. ఆయన వల్ల ఏయే రాశులకు లాభాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ రాశివారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటారుకానీ పాల్గొనరు. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి అధిక లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఈ రాశివారు కేవలం శనిదేవుడి వల్లే అనేక విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. అన్నీ అనుకూలంగా జరుగుతాయి. లంచాలు తీసుకునే ఉద్యోగులు మాత్రం దొరికిపోతారు.

తులా రాశి
వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. కష్టాలన్నీ తీరిపోయి ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి పనిచేస్తారు. డబ్బులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురుకావు. కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది.
కుంభ రాశి
కుంభరాశి అనేది శనిదేవుడి సొంత రాశి. ఎటువంటి సవాళ్లనైనా వీరు స్వీకరిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ధైర్యంగా ఉంటారు. ధనలాభం ఉంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కార్యాలయంలో ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. వేతనాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అయితే దుబారా ఖర్చులు చేయడం ఇంట్లో ఎక్కువ. వాటిని తగ్గించుకొని పొదుపు చేస్తే భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది. మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు ఇది అత్యంత శుభ సమయం.












Click it and Unblock the Notifications