ఈ ఏడాదిలో ఈ రాశులను కోటీశ్వరులుగా చేస్తున్న రాహువు
నవగ్రహాల్లో కీలకమైన గ్రహాలు రాహువు, కేతువు. అయితే వీటిని అశుభ గ్రహాలని భావించి చాలామంది భయపడుతుంటారు. ఇవి ఎప్పుడూ తిరోగమనదిశలోనే ప్రయాణిస్తాయి. నీడగ్రహాలని పేరు. కానీ ఇవి మంచి చేస్తే ఫలితం వందరెట్లు అధికంగా ఉంటుంది. శనిదేవుడి తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలు ఈ రెండు. ఒక్కో రాశిలో 18 నెలలు ప్రయాణిస్తాయి.
ప్రస్తుతం మీనరాశిలో ఉన్న రాహువు గత ఏడాది అక్టోబరులో ఇందులోకి ప్రవేశించాడు. 18 నెలలు పూర్తయిన తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి రాజయోగం పడుతుంది. వారికి ఏవిధంగా ఈ యోగంవల్ల ఉపయోగాలుంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
రాహువు ఈ రాశిలోని 11వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీనివల్ల ఉద్యోగస్థులు మంచి విజయాలు సాధించి పై అధికారుల దగ్గర పేరు తెచ్చుకుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని పనులు ధైర్యంతో చేయగులుగుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సులువుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారి మధ్య ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
కుంభ రాశి
ఈ రాశి మొదటి ఇంట్లో రాహువు సంచారం చేస్తాడు. దీనివల్ల కుంభరాశివారు ఆర్థిక లాభాలను పొందుతారు. అదృష్టం తోడుండటంవల్ల పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. అడుగు పెట్టిన ప్రతి రంగంలోను విజయాన్ని చాలా సులువుగా దక్కించుకుంటారు. పదిమందికి సాయపడతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశిలోని మూడో ఇంట్లో రాహువు సంచరిస్తాడు. దీనివల్ల గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. జీవితంలో మీరు ఊహించనిరీతిలో మార్పులు జరిగి ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications