ఈ రోజు నుంచే ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారం అవుతోంది!
ఈ నెల 21వ తేదీన పితృ అమావాస్య వచ్చింది. దీన్ని మహాలయ అమావాస్య అంటారు. చివరి సూర్య గ్రహణం కూడా ఈరోజే ఏర్పడనుంది. 21వ తేదీనే కొన్ని కీలక గ్రహాలు సంచారం చేస్తాయి. ఈ సంచారం ప్రభావంతో కొన్ని శుభయోగాలు ఏర్పడి రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. గజకేసరి రాజయోగం, శుక్ల యోగం, సర్వార్థ సిద్ధయోగం ఏర్పడుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా గజకేసరి యోగం వల్ల కొన్ని రాశులు అదృష్టవంతులు కాబోతున్నారు. వారి కోరికలన్నీ నెరవేరుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
కెరీర్ పరంగా అనేక ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. అనుకోకుండా ఆర్థిక లాభం కలుగుతుంది. ఈ సమయంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని, అన్ని పనులు పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయం సాధిస్తారు.

కన్యా రాశి
అద్భుతమైన ఫలితాలున్నాయి. పూర్వీకుల నుంచి ఈ రాశివారికి ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి కలిసివస్తుంది. వారి వ్యాపారాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలంటే పెద్దల సలహా తీసుకోవాలి. సీనియర్ల అనుభవంతో వాటిని ఆచరణలో పెట్టాలి.
మిథున రాశి
వీరికి కొంతకాలం నుంచి పనులు మొదలై నిలిచిపోయాయి. ఈ సమయంలో ఆ పనులన్నీ పూర్తవుతాయి. కొత్తగా అవకాశాలు వస్తాయి. వాటిని వినియోగించుకుంటే ఉద్యోగులు కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడటంవల్ల కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications