ఏప్రిల్, మే నెలల్లో ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
ఖగోళంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలోనే కొన్ని అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాయి. మీనరాశిలో ఐదు గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కలవడంవల్ల ఎన్నో శుభాలను కల్పించే పంచగ్రాహి రాజ యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఏప్రిల్, మే నెలల్లో విపరీతంగా కలిసివస్తోంది. ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది.
కన్యా రాశి
పంచగ్రహి రాజయోగం వీరిని కుబేరులను చేస్తోందని చెప్పొచ్చు. ఆస్తి పరంగా కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ సమయంలో అవన్నీ పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతో పనులన్నింటినీ పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటారు. సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. సంపాదించిన డబ్బును దానధర్మాలకు ఉపయోగిస్తే మంచి జరుగుతుంది.

మకర రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వారితో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. పిల్లల నుంచి శుభవార్తలున్నాయి. ఈ రాశివారికి ఈ సమయంలోనే ఏలినాటి శని ముగుస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారం పనిమీద విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్థుల వేతనాలు పెరుగుతాయి. మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది.
మిథున రాశి
వీరికి అనేకరకాలుగా, అనేక రీతుల్లో ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. టీచరు వృత్తిలో ఉన్నవారికి వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. దీనివల్ల అనేక లాభాలను అందుకుంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారికి వివాహం అవుతుంది. వ్యాపారస్తులు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మనసు సంతోషంతో నిండిపోతుంది. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పెద్ద పెద్ద కోరికలన్నీ నెరవేరతాయి.












Click it and Unblock the Notifications