దీపావళి రోజు నుంచి ఈ రాశుల తలరాత మారుతోంది... అష్టైశ్వర్యాలిస్తున్న మహాలక్ష్మి
ఈ ఏడాది దీపావళిని ఈనెల 31వ తేదీన జరుపుకుంటున్నాం. ఒకటోతేదీన కూడా అమావాస్య ఉండటంతో కొందరు ఆరోజు కూడా జరుపుకుంటున్నారు. దీపావళి రోజు లక్ష్మీపూజను చేస్తారు. ఒకరకంగా అది చాలా పవిత్రమైన దినం. ఆ తల్లి అనుగ్రహం కలిగి డబ్బులు రావాలంటే ఉపవాసాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ప్రసాదిస్తుంది. జీవితంలో వారు సుఖశాంతులను, సంతోషాలను పొందుతారు. మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఏయే రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం.

మేషరాశి
అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. ఎటువంటి ఆర్థిక సమస్యలు ఎదురుకావు. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు శుభప్రదంగా జరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించానలుకుంటున్నవారికి ఇది అనువైన సమయం. ఈ సమయంలో ఎటువంటి పని తలపెట్టినా విజయం దక్కుతుంది.
వృషభ రాశి
అదృష్టం కలిసివస్తుంది. దీపావళి రోజు నుంచి వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారాలు కూడా లాభదాయకంగా సాగుతాయి. శారీరకంగా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. కెరీర్ చాలా బాగుంటుంది. ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఎప్పటినుంచో ప్రారంభించాలనుకుంటున్న పనులను ఈ సమయంలో ప్రారంభించడంవల్ల విజయం సాధిస్తారు.
మిథున రాశి
వ్యాపారాలు మెరుగుపడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. కెరీర్ పరంగా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరతాయి. ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. పెద్దల నుంచి రావల్సిన ఆస్తుల వివాదాలు ఈ సమయంలోనే సమసిపోతాయి. పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసంతో ఉండి పనులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications