2025లో ఈ రాశుల జాతకం తిరుగులేనిది: శుక్రాచార్యులవారు
ధనుస్సు రాశిలో శుక్రుడు సంచారం చేయడంవల్ల అన్ని రాశులపై ప్రభావం ఉంటున్నప్పటికీ కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. వాస్తవానికి సంపదకు, ఐశ్వర్యానికి, శ్రేయస్సు, లగ్జరీ జీవితానికి, అందానికి కారకుడు శుక్రుడు. నవంబరు మొదటివారంలో ధనుస్సురాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని రాశులవారు రాజయోగాన్ని అనుభవిస్తున్నారు. ఏయే రాశులవారికి రాజయోగం పట్టుకుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఆర్థికంగా జీవితంలో స్థిరపడతారు. దీనికి కారణం శుక్రుడి సంచారమే. మీ వ్యక్తిగత ప్రవర్తన మార్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. రుణ సమస్యలు తీరిపోతాయి. అన్ని పనులు లాభదాయకంగానే ఉంటాయి. శుక్రుడు తోడుండటంవల్ల అదృష్టం బాగా పట్టుకుంటుంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధించారు. అందుకు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. అవి రాజుకు మంత్రి సలహాల్లా ఉపయోగపడతాయి.

మేషం
ఇంట్లో శుభకార్యాలున్నాయి. శుక్రుడు ధనుస్సులో సంచారం చేయడంవల్ల ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతున్నారు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు. డబ్బును పొదుపు చేసుకోవాలి. ఖర్చును నియంత్రించుకోవాలి.
వృశ్చికం
ఆర్థికంగా లాభాలు వస్తాయి. మాటలు ఆకర్షణీయంగా ఉండటంవల్ల అనేక సందర్భాల్లో పనులన్నీ పూర్తవుతుంటాయి. కొత్తగా పెట్టే పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు లాభాల బాటలో పయనిస్తుంటాయి. స్నేహితుల నుంచి, సన్నిహితుల నుంచి సహాయాన్ని అందుకొని జీవితంలో వృద్ధిలోకి వస్తారు. ధనుస్సు రాశిలో శుక్రుడి సంచారం వీరికి అనేక అవకాశాలను తెచ్చిపెడుతుంది.












Click it and Unblock the Notifications