బుధుడి సంచారం.. 5 రాశులకు ఐశ్వర్యం

జ్యోతిష్యంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. బుధుడి సంచారంవల్ల అన్ని రాశుల జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతి ఏడాది బుధుడు నాలుగు నుంచి ఐదుసార్లు సంచారం చేస్తాడు. రాబోయే జూన్ నెలలో మొదటిగా వృషభరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నారు. జూన్ 7వ తేదీ రాత్రి 7.45 గంటలకు ఇది జరగనుంది. బుధుడి సంచారంవల్ల ఏయే రాశులవారిపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

వృషభరాశి
ఈరాశివారిపై బుధుడి సంచార ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. కొత్త ఆదాయ వనరులు పుట్టుకురావడంతోపాటు అదృష్టాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఇది మంచి సమయంగా పరిగణిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది.

 zodiac

మకర రాశి
ఈ రాశివారికి సంచారం 5వ స్థానంలో జరగబోతోంది. ఎలాంటి పనులు తలపెట్టినా విజయవంతమవుతారు. అంతేకాదు.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల వీరికి కలిసివస్తుంది. చేసే అన్ని పనుల్లో అదృష్టం వీరికి తోడుగా ఉంటుంది.

సింహరాశి
వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం రెట్టింపవుతుంది. తద్వారా ఆర్థికంగా బలపడతారు. ఈ సమయంలో వీరు కష్టపడి పనిచేయడంవల్ల ఆశించినంత విజయాన్ని సాధిస్తారు.

ధనస్సు రాశి
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఫలితం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. వేతనం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.

 zodiac

కన్యారాశి
కన్యారాశికి అధిపతిగా బుధుడు వ్యవహరిస్తున్నాడు. బుధుడి సంచార ప్రభావం ఈ రాశివారిపై కూడా ఉంటోంది. ఎటువంటి పనులు చేపట్టినా సులభవంగా విజయవంతమవుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి ఇది మంచి సమయమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+