వాస్తు ప్రకారం స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపై పడొచ్చా?

ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా గుడికి ఎదురుగా ఉండేది కొనుగోలు చేయవద్దు. దేవుడి చూపు ఇంటిపై పడేవిధంగా నిర్మాణం ఉండకూడదంటారు. ఎక్కడైనా సరే అమ్మవారి ప్రధాన దేవాలయమైతే ఆ గుడి నీడ అస్సలు ఇంటిపై, స్థలంపై పడకూడదు. చిన్న చిన్న దేవాలయాలైతే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వీధిలో చిన్న చిన్న దేవాలయాలు కడుతున్నారు. అయితే ఇంటి ఎత్తు కంటే గుడి ఎత్తు తక్కువగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

దేవాలయాలు అనంతమైన శక్తిని కలిగివుంటాయి.
ఆ శక్తి తరంగాలు నీడ రూపంలో ఇంటిపై పడినప్పుడు,
ఆ ఇంట్లో నివసించే వారిపై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇంట్లో మనస్పర్థలు రావడం, సంతానం లేకపోవడం,
అశాంతి, చికాకు కలుగుతాయి.

vastu Is it acceptable for the shadow of a temple dedicated to a female deity to fall on a house

వాస్తు శాస్త్రం ప్రకారం, ఏ గుడి నీడ అయినా
ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్య ఇంటిపై పడకూడదు.
దీనిని 'ఛాయా దోషం' అంటారు.
ధ్వజస్తంభం లేదా గోపురం నీడ ఇంటిపై పడటం అశుభం.

దుర్గమ్మ, కాళికాదేవి, వారాహి వంటి ఉగ్ర రూపాలు లేదా లక్ష్మీదేవి, సరస్వతి వంటి శాంత రూపాలు
కొలువై ఉన్న గుడి నీడ ఇంటిపై పడటం మంచిది కాదు.
దేవాలయానికి, ఇంటికి మధ్య కనీసం 80 నుండి 100 అడుగుల దూరం ఉండాలి.
అంతకంటే తక్కువ దూరంలో ఉండి, నీడ పడుతుంటే అది దోషం.

ఒకవేళ గుడికి, మీ ఇంటికి మధ్య రోడ్డు లేదా కాలువ ఉంటే దోష తీవ్రత తగ్గుతుంది.
గుడి వెనుక భాగంలో ఇల్లు ఉంటే దోషం తక్కువ.
గుడికి ఎదురుగా ఉంటే దోషం ఎక్కువ.
ఇంటి గుమ్మానికి దిష్టి గుమ్మడికాయను కట్టడం వల్ల ప్రతికూల శక్తి తగ్గుతుంది
ఇంటికి, గుడికి మధ్యలో ఎత్తైన చెట్లను పెంచడం ద్వారా
నీడ నేరుగా ఇంటిపై పడకుండా చూడొచ్చు.
గుడి నీడ పడే దిశలో ఒక చిన్న అద్దాన్ని అమర్చాలి.
దీనివల్ల శక్తి రిఫ్లెక్ట్ అవుతుంది. దోషం తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+