వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చపాతీలను లేదా రొట్టెలను లెక్కపెట్టి చేయడం పరమ దరిద్రమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏ ఆహారాన్నైనా వండకముందే లెక్కపెట్టడం అనేది సరికాదు. దీనివల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది. ఆ ప్రభావం సంపదపై పడుతుంది. అందుకే లెక్కపెట్టకుండా అవసరమైతే మూడు రొట్టెలు, చపాతీలు ఎక్కువే చేసుకొని, తర్వాత సరిపోయాయి అనుకుంటే వాటిని మూగజీవాలకు పెట్టడం అత్యంత ఉత్తమం. ఆహారం అంటే అన్నపూర్ణ కాబట్టి, వంటగదిలో కొరత రాకుండా చూసుకోవాలి. అవసరమైతే మనమే నలుగురి కడుపు నింపేలా ఉండాలి.
లెక్కపెడితే మన ప్రవర్తన, మనస్తత్వం
ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయి.
ఏ పనినైనా లెక్కలతో చేస్తే, ఆ ప్రభావం తెలియకుండానే
కుటుంబంలో అభద్రతా భావం పడుతుంది.
ఆహారం పుష్కలంగా ఉన్నచోట ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉంటాయి.

ఆహారం అనేది సంపదకు కారణం.
చపాతీలను లెక్కపెట్టినప్పుడు ప్రతిదీ మనం కొలిచి కొలిచి వాడుతున్నట్లుగా సూచిస్తుంది.
మనకున్న ఆలోచన ఏమవుతుందంటే కరువును పెంచుతుంది.
ఆహారాన్ని నిండు మనసుతో స్వీకరించిన చోట లక్ష్మీదేవి నివసిస్తుంది.
ధాన్యాన్ని లెక్కించడంవల్ల అది అవమానంగా అనిపిస్తుంది.
మిగిలిపోయిన ఆహారాన్ని పారేయకూడదు.
జంతువులకు లేదంటే అవసరమైనవారికి పెట్టాలి.
ఆహారం వృథా చేయవద్దు.
ప్రశాంతమైన మనసుతో వంట చేయాలి.
ఆ శక్తి ఇల్లు మొత్తం వ్యాపిస్తుంది.
ఆహారాన్ని కోపంతో వండకూడదు.
ప్రశాంతంగా వండితే పాజిటివ్ ఎనర్జీ
కోపంతో వండితే నెగెటివ్ ఎనర్జీ వస్తాయి.
చపాతీ పిండిని ఎక్కువగా కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు.
తాజా పిండిని కలుపుకోవాలి.
చపాతీ చేసేటప్పుడు పీట నుంచి శబ్ధం రాకూడదు.
పీట కింద ఒక గుడ్డ వేస్తే శబ్ధం రాకుండా నివారించవచ్చు.












Click it and Unblock the Notifications