వాస్తు ప్రకారం సాయంత్రం వేళ ఎవరికీ ఇవ్వకూడని వస్తువులు

సంప్రదాయ వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత గడిచే సమయం చాలా సున్నితమైనది. ఈ సమయంలో ఇంట్లో చేసే కొన్ని పనులు, తీసుకునే నిర్ణయాలు కుటుంబ ఆర్థిక, మానసిక స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటిని ఆధ్యాత్మికంగా 'ప్రదోష కాలం'గా పరిగణిస్తారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని కాపాడుకునేందుకు, అశుభాలను నివారించేందుకు మరియు కుటుంబ శ్రేయస్సును పెంపొందించేందుకు కొన్ని నిర్దిష్ట జాగ్రత్తలు పాటించడం అవసరమని వాస్తు నిపుణులు సూచిస్తారు.

పాలు, పెరుగు, డబ్బు: పాలు, పెరుగులకు చంద్రుడితో సంబంధం ఉంటుంది. సాయంత్రం వేళ వీటిని ఇతరులకు ఇస్తే కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గుతాయి. అలాగే, లక్ష్మీదేవి సంచరించే సమయం కావడంతో, ఈ వేళ ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో నగదు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Vastu Tips After Sunset Keep Your Door Open and Light a Lamp for Good Fortune Move for Harmony

పసుపును అదృష్టానికి, ఆర్థిక వృద్ధికి సంకేతంగా భావిస్తారు. పసుపు గురు గ్రహానికి సంకేతం కూడా. ఇంటి సమతుల్యతకు ఉప్పు, వృద్ధికి పెరుగు ప్రతీకలు. సాయంత్రం పూట వీటిని ఇతరులకు ఇవ్వడం వల్ల ఇంటి ఐక్యత దెబ్బతింటుందని భావిస్తారు. ఇక లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించే నగదును, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పాలను సూర్యాస్తమయం తర్వాత ఇవ్వడం అత్యంత అశుభకరమని, ఇది ఇంట్లోకి రావాల్సిన సిరిసంపదలను అడ్డుకుంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.

ఉల్లిపాయ, వెల్లుల్లి: జ్యోతిష్యం ప్రకారం ఉల్లి, వెల్లుల్లి తామసికమైనవి. వీటిని సాయంత్రం వేళ ఇతరులకు ఇస్తే ఇంట్లో నెగటివిటీ ప్రవేశిస్తుంది.

సూది-దారం, చెప్పులు: సూర్యాస్తమయం తర్వాత సూది వంటి పదునైన వస్తువులను బదిలీ చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్థలు పెరుగుతాయని చెబుతారు. అలాగే ఎవరికైనా చెప్పులను కానుకగా ఇవ్వడం లేదా పాత వాటిని దానం చేయడం వల్ల దరిద్రానికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తులని దెబ్బతీస్తుంది.

చీపురు: చీపురును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి దీన్ని సాయంత్రం వేళ ఎవరికీ ఇవ్వకూడదు లేదా ఇంటి వెలుపల పారేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక వృద్ధి ఆగిపోతుంది.

ప్రతికూలతలను పోగొట్టి, సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ఉత్తమ మార్గం. ఇంటి గడపను చీకటిగా ఉంచడం వల్ల దైవిక శక్తి ప్రవేశించదని గుర్తుంచుకోవాలి. అలాగే, తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. సాయంత్రం సమయంలో తులసి దళాలను తుంచడం నిషిద్ధం. ఆ సమయంలో తులసిని దర్శించుకుని, దీపం వెలిగించి పూజించడం వల్ల ఆ ఇంట్లో శాంతి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.

ఈ ఆచారాలు మూఢనమ్మకాలు కావు. ఇవి క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని, ప్రకృతి శక్తుల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయి. ఆధునిక కాలంలో వేగవంతమైన జీవితం సాగిస్తున్నప్పటికీ, ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మన సంప్రదాయ పద్ధతుల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని, వాటిని పాటిస్తూ ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి, కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+