వారఫలితాలు తేదీ 29 నవంబర్ 2024 శుక్రవారం నుండి డిసెంబర్ 5 గురువారం వరకు
డా. ఎం .ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష , జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries)అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది. ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో ఆర్థిక అవరోధాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus)కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:- ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఇంట బయట సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. బంధువులు, మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్తిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. అన్ని రంగాల వారికి పనులలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini)మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:- ఈ వారం చేపట్టిన పనులు అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమల ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువర్గంతో ఆకారణంగా వివాదాలు కలుగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer)పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:- ఈ వారం మంచి మాట తీరుతో ఇంటాబయటా అందరిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతంకంటే మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించని పదోన్నతులు పొందుతారు. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo)మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి. సొంత ఆలోచనతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. పనులలో ఆటంకాలుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo)ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:- ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra)చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:- ఈ వారం చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణ సమస్య నుంచి బయటపడతారు. స్థిరస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరుల తో మటపట్టింపులుంటాయి. ఆదయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio)విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:- ఈ వారం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘాకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మటపట్టింపులుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి ( Sagittarius)మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుచకుంటారు. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటాబయటా నీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో మిత్రులతో కలహా సూచనలున్నవి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn)ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-ఈ వారం ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత విషయాలు మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం చివరిలో పనులలో ఆటంకాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి ( Aquarius)ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో ధన పరంగా ఇతరులకు మాటే ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices)పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభకార్యాలకు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహం శుభకార్యాల పై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
-
120 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం -
శుక్ర శనిదేవుల యుతి.. మార్చిలో ఈ రాశులవారికి సంపదల ప్రాప్తి -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
వాస్తు ప్రకారం స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపై పడొచ్చా? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!!












Click it and Unblock the Notifications