Samantha: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న 'మా ఇంటి బంగారం' మూవీ వాయిదా పడింది. మే 15వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. 'మా ఇంటి బంగారం' మూవీని జూన్ 19న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించారు. సమంత స్వయంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది.
తొలుత ఈ మూవీని జూన్ 4 విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమంత సినిమా ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. జూన్ 19న రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో సమంత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా శ్రీముఖి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సమంతానే ఈ సినిమాకి నిర్మాణం వహించిన విషయం తెలిసిందే.

సమంత, నందిని రెడ్డి కాంబోలో గతంలో ఓ బేబీ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో 'మా ఇంటి బంగారం' మూవీపై భారీగా అంచనాలు నెలకున్నాయి. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే 2010 లో ఏమాయె చేశావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను పెంచుకుంది. ఇప్పుడు యశోద, ఓ బేబీ, మా ఇంటి బంగారం లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకెళ్తోంది.












Click it and Unblock the Notifications