పార్టీ పదవుల నుంచి అవుట్, మోదీ కేబినెట్ లో ఆ ఇద్దరికీ ఎంట్రీ..!!

తెలంగాణ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణకు చోటు కల్పించలేదు. ఇప్పటి వరకు జాతీయ నాయకత్వంలో ఉన్న ఇద్దరి నీ తప్పించారు. దీని వెనుక పక్కా వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో త్వరలో జరిగే మోదీ కేబినెట్ ప్రక్షాళనలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. కేబినెట్ లో ఇన్.. అవుట్ పైన చర్చ మొదలైంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీం లో కీలక మార్పులు జరిగాయి. ఏపీ నుంచి ఒక విధంగా ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణకు అసలు ప్రాధాన్యత దక్కలేదు. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఝలక్‌ ఇచ్చిందనే చర్చ మొదలైంది. దేశంలోని దాదాపు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ఈ టీమ్‌ లో అవకాశం కల్పించగా.. దక్షిణాదిన ప్రాతినిధ్యం లభించని ఏకైక రాష్ట్రం తెలంగాణగా నిలిచింది. డీకే అరుణ స్థానంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. అలాగే.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్న కె.లక్ష్మణ్‌ స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అమర్‌ పాల్‌ మౌర్యను నియమించారు. తెలంగాణను 'గేట్‌ వే ఆఫ్‌ సౌత్‌'గా భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో ఎవరికీ చోటు కల్పించకపోవడం రాష్ట్ర పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. బీజేపీ నాయకత్వ ఆలోచనల పైన ముఖ్య నేతలు తర్జన భర్జన పడుతున్నారు.

బీజేపీ కొత్త టీం ప్రకటన: పురందేశ్వరి కి ఊహించని పదవి, తెలంగాణ నేతలకు షాక్....!!
బీజేపీ కొత్త టీం ప్రకటన: పురందేశ్వరి కి ఊహించని పదవి, తెలంగాణ నేతలకు షాక్....!!
telangana-draws-blank-in-nitin-nabin-s-new-bjp-national-team-speculations-over-union-cabinet-re-shu

త్వరలో మోదీ కేబినెట్ ప్రక్షాళన

ఇదే సమయంలో దక్షిణాది నుంచి కేరళం, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ నాయకత్వం, తెలంగాణాకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవడం నిరాశగా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మా పార్టీ నాయకత్వం ఇటీవలే కొంత కఠినంగా వ్యవహరించడం ఆరంభించింది. అయితే.. కేంద్ర మంత్రి వర్గంలో డీకేఅరుణకు చోటు కల్పించేందుకే ఆమెను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కాకపోతే, కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఇప్పటికే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. మోదీ టీమ్‌లో మార్పులు ఖాయమని చెబుతున్నారు. మంత్రివర్గంలోకి ఈటల రాజేందర్, లక్ష్మణ్, అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేర్లు రేసులో ఉన్నాయి. అయితే.. వచ్చే వారం వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+