కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల ప్రధాన హామీ అమలు - నేడే ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్దం అవుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో 34 శాతం బీసీలకు రిజర్వేషన్ల అమలు పైనా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ నివేదిక పైన ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. సాంకేతిక - న్యాయ పరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఏదైనా అవాంతరాలు వస్తే ప్లాన్ బీ సిద్దం చేస్తున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ రోజు (మంగళవారం) జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. అలాగే... స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27శాతం వాటా ఇవ్వాలని సిఫారసు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీంతో.. ఇదే అంశం పైన పార్టీ ముఖ్యులతో సీఎం చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. కాగా, చివరకి 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు.

నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
ఇదే సమయంలో కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. బీసీలకు 34 శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చునని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ప్రత్యేకంగా చట్టం కూడా చేయనక్కర్లేదు. దీనిపై జీవో జారీ చేస్తే సరిపోతుంది. పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం.. పట్టణ స్థానిక సంస్థల్లో మూడోవంతు బీసీలకు కేటాయిస్తూ మంగళవారం క్యాబినెట్‌లో తీర్మానం ఆమోదిస్తారు. ఆ మేరకు కొత్తగా జీవో జారీ చేస్తారు. అయినప్పటికీ... దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయించి, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తే 'ప్లాన్-బీ' అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూనే, పార్టీ పరంగా బీసీలుకు 34 శాతం సీట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం పైన ఈ రోజు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.













Click it and Unblock the Notifications