పార్టీ అభ్యర్ధులుగా వారే, స్థానిక ఎన్నికల్లో జరిగేది ఇదే- జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి- వైసీపీ రెండు వైపులా స్థానిక ఎన్నిక లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేడర్ కు ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు పైన సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇటు మాజీ సీఎం జగన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులు.. కూటమిని ఎదుర్కొనే వ్యూహాల పైన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లకు కీలక మార్గ నిర్దేశనం చేసారు. ఎవరికి సీట్లు ఇవ్వాలో స్పష్టత ఇచ్చారు. వారికి టాస్క్ ఫిక్స్ చేస్తూ.. కీలక సూచనలు అందించారు.

స్థానిక ఎన్నికల పైన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లకు మాజీ సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం చేసారు. ప్రత్యేకంగా వారితో సమావేశమైన జగన్.. స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి బలమైన, మంచి అభ్యర్ధుల ను వేగంగా గుర్తించాలని సూచించారు. పార్టీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక నాయకత్వాన్ని పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని నిర్దేశించారు. పోలీసుల బలంతో అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారని.. వాటిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్దం కావాలని సూచించారు. ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాల పై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక కోసం తీసుకునే నిర్ణయాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగ పడాలని సూచించారు. పార్టీలో అందరితో మాట్లాడి.. అందరి అభిప్రాయాలు తీసుకొని.. పలు దఫాలు చర్చించి అభ్యర్ధుల జాబితాను తయారు చేయాలని స్పష్టం చేసారు.

 TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
ysrcp-chief-ys-jagan-fixed-action-plan-to-the-party-regional-coordinators-over-local-body-elections

అభ్యర్దుల ఖరారు.. ఎన్నికల వ్యూహాల పై స్పష్టత

పార్టీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ఎన్నికల్లో ముందుకు నడవాలని జగన్ నిర్దేశించారు. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని చెప్పారు. రెండున్నారేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను.. వెన్నుపోటును ప్రజలను వివరించాలని సూచించారు. ప్రతీ గడప వద్దకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన పాలన గురించి వివరిస్తూనే.. రెండున్నారేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన నష్టాలను.. కష్టాలను చెప్పాలని పేర్కొన్నారు. పోలీసు బలంతో అడ్డదారుల్లో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారని..వాటిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్దం కావాలని.. ఎక్కడికి అక్కడ ప్రత్యామ్నాయాలతో తయారు గా ఉండాలని జగన్ నిర్దేశించారు. అభ్యర్ధుల ఖరారులో స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే.. కేడర్ అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని జగన్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+