భారత్ హ్యాట్రిక్.. జోరు మామూలుగా లేదు!

Asian Games 2026: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల గ్రూప్ దశలో భారత పురుషుల హాకీ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. కకామిగహారా వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన దక్షిణ కొరియా జట్టును భారత్ 8-2 తేడాతో ఘోరంగా ఓడించింది. టోర్నీలో వరుసగా లభించిన ఈ మూడో విజయంతో భారత జట్టు తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ నాకౌట్ వైపు బలంగా అడుగులు వేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్, దిల్‌ప్రీత్ సింగ్ చెరో రెండు గోల్స్‌తో రాణించగా.. శిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, రాజిందర్ సింగ్ తలా ఒక గోల్ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!
IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!

మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే భారత ఆటగాళ్లు ప్రత్యర్థిపై తమ దాడులను ప్రారంభించారు. మ్యాచ్ 4వ నిమిషంలోనే శిలానంద్ లక్రా అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత 9వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్, 11వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో తొలి 11 నిమిషాల్లోనే భారత్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ముగిసే సమయానికి అంటే 14వ నిమిషంలో అభిషేక్ మరో గోల్ చేయడంతో మొదటి క్వార్టర్ పూర్తయ్యేసరికే భారత్ 4-0తో స్పష్టమైన ఆధిపత్యాన్ని సాధించి ప్రత్యర్థి కొరియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.

Asian Games 2026 India Beat South Korea 8-2 to Seal Third Straight Hockey Win Full Details Here

రెండో క్వార్టర్ లోనూ భారత తమ దూకుడును తగ్గించలేదు. 26వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ భారత్ తరఫున ఐదో గోల్ నమోదు చేయగా.. 32వ నిమిషంలో ఆయన మళ్లీ మెరిసి తన వ్యక్తిగత రెండో గోల్ ను సాధించాడు. ఆ వెంటనే 38వ నిమిషంలో అభిషేక్ మరో గోల్ తో మెరిసి భారత్ ఆధిక్యాన్ని 7-0కి పెంచాడు. ఈ దశలో ఏడు గోల్స్ వెనుకబడిన దక్షిణ కొరియా కోలుకోవడానికి ప్రయత్నించి 42వ నిమిషంలో కిమ్ దేహో, 52వ నిమిషంలో కిమ్ యోంగ్‌బోక్ ద్వారా రెండు గోల్స్ సాధించగలిగింది. అయితే మ్యాచ్ ముగిసే చివరి నిమిషంలో రాజిందర్ సింగ్ భారత తరఫున 8వ గోల్ సాధించడంతో భారత్ 8-2తో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్
మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

టోర్నీ ప్రారంభం నుంచి భారత హాకీ జట్టు పూర్తి ఏకపక్ష విజయాలతో సంచలనం సృష్టిస్తోంది. తమ మొదటి మ్యాచ్ లో ఇండోనేషియాను 13-1 తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. ఆ తదుపరి మ్యాచ్ లో శ్రీలంకంపై 16-1 భారీ తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఆసియాలో అత్యంత బలమైన కొరియా జట్టును కూడా 8-2తో ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. భారత జట్టు తమ తదుపరి గ్రూప్ మ్యాచ్ ను సెప్టెంబర్ 26న ఆతిథ్య జపాన్ దేశంతో ఆడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+