Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!

ఎన్నికల సంఘంలో తోటి కమిషనర్లకు తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో పదవి నుంచి తప్పుకోవాలని, లేకపోతే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీజేపీ నేతలు.. సీఈసీ తక్షణం తప్పుకోకుంటే దీనిపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఓటింగ్ హక్కుల నిర్వహణ తీరుపై సీఈసీ వ్యవహరిస్తున్న తీరుపై సీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?
మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?

ప్రధాన ఎన్నికల కమిషనరే అతిపెద్ద దేశద్రోహి అని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే ఆరోపించారు. జ్ఢానేష్ కుమార్ ఈ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి అన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కదా ప్రజాస్వామ్యం అంటే? జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పటి నుండి, ఎవరు ఓటు వేయాలి , ఎవరు వేయకూడదు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోందన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యానికి ఇదెలాంటి నిర్వచనం? మీరు ప్రజాస్వామ్య భావననే తలకిందులు చేశారని దిప్కే నిప్పులు చెరిగారు.

CJP Founder Abhijeet Dipke Slams CEC Gyanesh Kumar Calls for His Immediate Resignation
ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!
ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!

దేశంలోని యువతకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర జరుగుతోందని, దీన్ని దేశ ప్రజలమైన తాము ఏమాత్రం సహించమని సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్షంతో గానీ లేదా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ వంటి ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదన్నారు. ఇవి ఆయా పార్టీలకు సంబంధించిన సమస్యలు కావని, ఇవి దేశ యువతకు సంబంధించిన సమస్యలని తెలిపారు. అందుకే తాము మూడు డిమాండ్లను ముందుకు తెస్తున్నామన్నారు. ఇందులో మొదటి డిమాండ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి, ఆయనపై తక్షణమే క్రిమినల్ చర్యలు ప్రారంభించాలి, జ్ఞానేష్ కుమార్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు?' అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు..

రెండవ డిమాండ్ రాబోయే ఎన్నికలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని, SIRను నిలిపివేసి, జనవరి 2025 నాటి ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేలా ఒక స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి, SIRకు సంబంధించిన నిర్ణయ ప్రక్రియలన్నింటినీ పరిశీలించాలన్నారు. ఇందులో సుప్రీంకోర్టు పాత్ర కూడా ఉంది. కాబట్టి, SIRకు సంబంధించిన ఫైళ్లు మరియు నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తక్షణమే స్వాధీనం చేసుకుని కోర్టు ఆధీనంలో ఉంచాలని సుప్రీంకోర్టును సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు. తద్వారా భవిష్యత్తులో 'ఎలక్షన్ కమిషన్ భవనంలో అగ్నిప్రమాదం జరిగి ఫైళ్లు కాలిపోయాయి లేదా కనిపించకుండా పోయాయి అని ఎవరూ చెప్పడానికి వీలుండదన్నారు. మూడవ డిమాండ్ భారత ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలని, పౌర సమాజ సభ్యుల క్రియాశీల భాగస్వామ్యంతో, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే కొత్త చట్టాన్ని రూపొందించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+