CEC జ్ఞానేష్ కూతురికి సుప్రీం ఊరటపై వివాదం- రోస్టర్ ఉల్లంఘన, 5 లక్షల ఫైన్ పై స్టే..!

నోయిడా జిల్లా కలెక్టర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె కూడా అయిన మేధా రూపమ్‌కు (Medha Roopam) సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆకృతి చౌదరి కేసుకు సంబంధించి, ఆమె జీతం నుంచి 5 లక్షల పరిహారం చెల్లించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అదే సమయంలో విద్యార్థిని నిర్బంధాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును కూడా సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ ఉత్తర్వులు వివాదాస్పదం కావడంతో పాటు అసలు ఈ బెంచ్ కు ఈ కేసు కేటాయింపు కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!
బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!

గతంలో నోయిడా కార్మికుల నిరసనలకు సంబంధించిన కేసులో విద్యార్థిని ఆకృతి చౌదరిపై ఎన్‌ఎస్‌ఏ కింద విధించిన నిర్బంధాన్ని అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. నోయిడా జిల్లా కలెక్టర్ తగిన బలమైన ఆధారాలు లేకుండా, కేవలం పోలీస్ నివేదిక ఆధారంగా ఆలోచించకుండా వ్యవహరించారని పేర్కొంది. ఇలాంటి నిరంకుశ ధోరణుల వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నియంతృత్వ రాజ్యంగా మారుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థినికి రూ. 5 లక్షల పరిహారాన్ని డీఎం మరియు బాధ్యులైన అధికారుల జీతం నుంచి రికవరీ చేయాలని ఆదేశించింది. దీనిపై మేథ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Noida DM Medha Roopam Gets SC Relief in NSA Case Questions Raised Over Bench Assignment

EC ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్- సీఈసీతో విభేదిస్తున్న కమిషనర్లపైకి ఈడీ, సీబీఐ ?
EC ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్- సీఈసీతో విభేదిస్తున్న కమిషనర్లపైకి ఈడీ, సీబీఐ ?

అయితే సుప్రీంకోర్టు రోస్టర్ ప్రకారం చూస్తే ఈ పిటిషన్ జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ కు విచారణ కోసం కేటాయించాల్సి ఉంది. అలా కాకుండా జూనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ కు కేటాయించడం ప్రశ్నలు లేవనెత్తింది. మేధ రూపమ్ కు ఊరట కల్పించేందుకే ఇలా చేశారంటూ ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తో పాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
జూలై 13 నుండి అమల్లో ఉన్న రోస్టర్ ప్రకారం ముందస్తు నిర్బంధం వ్యవహారాలను విచారించే బాధ్యత జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం వద్ద లేకపోయినా ఆ పిటిషన్లను విచారించింది. దీనిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీలును, అత్యంత సీనియర్ అయిన 4 ధర్మాసనాల వద్ద మాత్రమే ఉన్నప్పటికీ, అత్యంత కనిష్ఠ న్యాయస్థానమైన జస్టిస్ ఎస్.సి. శర్మ వద్దకు చేర్చడం దిగ్భ్రాంతికరమని తెలిపారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+